మామూలుగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ఒక సినిమాకు ఓకే చేసిన తర్వాత కొన్ని కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలను రిజెక్ట్ చేయడం అన్నది కామన్.కొన్ని కొన్ని సార్లు కొంత భాగం షూటింగ్ జరుపుకున్న తర్వాత కూడా హీరో హీరోయిన్లు ఆ సినిమాల నుంచి తప్పుకుంటూ ఉంటారు.
అలా గతంలో చాలా మంది హీరోయిన్ హీరోయిన్లు అలా చేసిన విషయం తెలిసిందే.ఉదాహరణకు ఇటీవలే గుంటూరు కారం సినిమా నుంచి పూజ హెగ్డే తప్పుకోవడంతో ఆ హీరోయిన్ మారిపోయిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు ఇలాంటి టాక్ విజయ్ దేవరకొండ( Vijay devarakonda ) హీరోగా నటిస్తున్న సినిమాపై వినిపిస్తోంది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి( Gowtam Tinnanuri ) కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.ఇందులో మొదట హీరోయిన్గా శ్రీలీల అనుకున్నారు.కానీ రష్మికను తీసుకుంటున్నారు అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి.
అబ్బే అస్సలు కానే కాదు.శ్రీలీలే మా హీరోయిన్ అంటూ ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఢంకా భజాయించి మరీ చెప్పారు నిర్మాత నాగవంశీ.
ఇలా ఈ సినిమా హీరోయిన్ విషయంలో ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.తాజాగా కూడా మరో గాసిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

కాగా విజయ్ నటిస్తున్న సినిమా నుంచి శ్రీలీల ( Sreeleela )తప్పుకోవడం అన్నది కరెక్టే అని, అయితే ఆ ప్లేస్ లోకి రష్మిక రాలేదని, ఆమె డేట్ లు అడ్జెస్ట్ కాలేదని, అందుకే హీరోయిన్ గా సాక్షి వైద్య( sakshi vaidya )ను తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి.ఏజెంట్ సినిమా లోనూ, వరుణ్ తేజ్ సినిమా లోనూ నటించింది సాక్షి వైద్య.అయితే అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా విడుదలకు ముందు ఈమెను వెతుక్కుంటూ ఆఫర్లు వచ్చాయి.కానీ తరువాత అన్నీ ఆగాయి.ఇప్పుడు ఈ సినిమా కనుక ఫిక్స్ అయితే మంచి ఆఫర్ నే అవుతుందని చెప్పవచ్చు.







