మంచిని ఎవరు చెరిపేయలేరు లోకేష్ ఎమోషనల్ పోస్ట్..!!

చంద్రబాబు అరెస్ట్( Chandrababu arrest ) అయిన నాటి నుండి నారా భువనేశ్వరి ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టడం జరిగింది.ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని వివరిస్తూనే పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ధైర్యం చెబుతున్నారు.

 No One Can Erase The Good Lokesh Emotional Post Nara Lokesh, Tdp, Nara Bhuva-TeluguStop.com

పార్టీ నిర్వహించే అనేక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.కచ్చితంగా మంచి రోజులు వస్తాయని ఎవరు ఆందోళన చెందవద్దని నారా భువనేశ్వరి భరోసా ఇస్తున్నారు.

ఈ క్రమంలో “నిజం గెలవాలి” అనే కార్యక్రమంతో చంద్రబాబు అక్రమ అరెస్ట్ జరిగిన అన్యాయం ప్రజలకు భువనేశ్వరి తెలియజేస్తున్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నారా భువనేశ్వరి ( Nara Bhuvaneswari )సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.“చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ పై ‘నిజం గెలవాలి‘ అని ప్రజలతో కలిసి పోరాడుతున్నా.

ఈ క్రమంలో ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జనం చూపుతున్న ఆదరణ, కురిపించే ప్రేమ ఈ కష్ట సమయంలో మాకు ఎంతో ఊరటనిస్తోంది.

వారిచ్చే మద్దతు ఎంతో ధైర్యాన్నిస్తోంది.నన్ను కలిసిన ప్రజలు చంద్రబాబు గారి పాలనలో జరిగిన మంచి గురించి, నేటి రాక్షస పాలనలో పడుతున్న ఇబ్బందుల గురించి వివరించారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వేలాది మందికి ఉపాధి కల్పించిన టీసీఎల్ సంస్థ ప్రతినిధులు కలిసి చంద్రబాబు ( Chandrababu )గారి చొరవతో ఈ సంస్థ ఏర్పాటు అయిందని చెప్పినప్పుడు ఎంతో గర్వపడ్డా.ఇవన్నీ చూశాక మంచి ఎప్పటికైనా నిలుస్తుందని.

నిజం తప్పక గెలుస్తుందని మరింత దృఢంగా చెప్పగలుగుతున్నా” అని ట్వీట్ చేయడం జరిగింది.దీంతో తల్లి నారా భువనేశ్వరి చేసిన ట్వీట్ నీ లోకేష్ రీ ట్వీట్ చేసి.ఔనమ్మా… గుర్తుంది.చేసిన మంచిని ఎవరూ చెరిపేయలేరు అని కామెంట్ చేయడం జరిగింది.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube