మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ramcharan Tej ) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొంది.
ఈ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ తన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే శంకర్ ( Shankar ) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ ( Game Changer )అనే సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమా ప్రస్తుతం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ జరగండి ( Jaragandi) అనే పాటను దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించినటువంటి పోస్టర్ కూడా విడుదల చేయక ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందులో రామ్ చరణ్ వెనక్కి తిరిగి నీలిరంగు చొక్కాలో కనిపిస్తున్నారు.అలాగే ఈ పాటలో ఉండే బ్యాక్ గ్రౌండ్ కూడా చాలా కలర్ ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తోంది.
ఇలా ఈ పోస్టర్ విడుదల కావడంతో పాట గురించి కూడా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.

సాధారణంగా శంకర్ తన సినిమాలలోని పాటల కోసం భారీగానే డబ్బు ఖర్చు చేస్తారు అనే సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమాలోని జరగండి అనే పాట కోసం కూడా భారీగా ఖర్చు పెట్టారని తెలుస్తోంది ఈ పాటలో ఉండే బ్యాక్ గ్రౌండ్ లొకేషన్ సెట్ లా కాకుండా నిజమైనటువంటి ప్రదేశంలో ఉండడం కోసం ఈయన ఎంతో కష్టపడ్డారని తెలుస్తోంది అందుకే ఈ పాట కోసం భారీగానే ఖర్చు కూడా అయిందని సమాచారం కేవలం ఈ పాటను షూట్ చేయడానికి వేసిన సెట్ కోసమే ఏకంగా 16 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.ఇక ఈ విషయం తెలియడంతో ప్రతి ఒక్కరూ కూడా షాక్ అవుతున్నారు ఒక్క పాట కోసం 16 కోట్లు ఖర్చు చేయడం ఏంటి? ఏకంగా రెండు చిన్న సినిమాలు చేయొచ్చు అంటూ కామెంట్ చేస్తున్నారు.







