ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం జానపద పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి.జానపద గాయకుల సంస్కృతి, ప్రతిభను మెచ్చుకునే చాలా మంది ప్రజలు వాటిని బాగా ఎంజాయ్ చేస్తారు.
వీటిలో కొన్ని పాటలు ఎంతగా ఆదరణ పొందాయంటే వాటిని ప్రముఖ సంగీత దర్శకులు భారీ బడ్జెట్ తెలుగు సినిమాల్లో కూడా వాడేశారు.అలాంటి సంగీత దర్శకుడు ఆర్.
పి.పట్నాయక్ ( R P Patnaik )శ్రీకాకుళం పాటలను పలు సినిమాల్లో వాడుకుని హిట్ సాంగ్స్‌గా తీర్చిదిద్దారు.ఇక పలాస సినిమాలోని నాది నక్కిలీసు గొలుసు పాట ప్రేక్షకుల్లో సంచలనంగా మారింది.ఇది కూడా శ్రీకాకుళం జానపదం పాటే.ఇక “పల్సర్ బైక్ సాంగ్” యువతను ఆకట్టుకుంది.ఏ కూడా శ్రీకాకుళం జానపద గాయకులలో పుట్టిన పాట.దీనిని రవితేజ నటించిన ధమాకా చిత్రంలో వాడారు.

తాజాగా మరో శ్రీకాకుళం పాట సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది.లింగ్ లింగ్ లింగ్ లింగ్ లింగిడి అనే ఈ పాట ప్రసిద్ధ గీతా ఆర్ట్స్ నిర్మించిన కోటబొమ్మాళి పిఎస్ చిత్రంలో ( Kota bommali PS )చేర్చారు.ఆన్‌లైన్‌లో విడుదలైన ఈ పాట త్వరలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.
ఈ పాట సినిమాకి విపరీతమైన హైప్ కూడా తెచ్చిపెట్టింది.

అయితే, ఈ పాట అందరికీ బాగా నచ్చి ఎంజాయ్ చేస్తున్నా, కొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు.ముఖ్యంగా శ్రీకాకుళానికి చెందిన జానపద గాయకుడు మల్లేష్ ( Mallesh )ఈ పాట తాను క్రియేట్ చేసిన తన ఒరిజినల్ సాంగ్ అని అంటున్నాడు.ఇది తన అనుమతి లేకుండా కాపీ చేశారని ఆరోపిస్తున్నాడు.
తాను 40 ఏళ్ల క్రితం ఈ పాట రాశానని, వివిధ ఇళ్లలో కుమ్మరి పని చేస్తూ జీవనోపాధి పొందేవాడినని తెలిపారు.తన పాటను చిత్రబృందం ఉపయోగించుకున్న విషయం తనకు తెలియదని తెలిశాక తాను ఎంతో బాధపడ్డారని అన్నారు.
తనకు ఎలాంటి క్రెడిట్ గానీ, పరిహారం గానీ ఇవ్వలేదని పేర్కొన్నాడు.తన ఆవేదనను, ఆగ్రహాన్ని మీడియా ముందు వ్యక్తం చేస్తూ తన పనికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మరి ఈ ఆరోపణలపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.గతంలో సారంగదరియా వంటి పాటలను సినిమా వాళ్లు కాపీ చేశారని ఒక జానపద గాయకురాలు మీడియా ముందుకు వచ్చి రచ్చ రచ్చ సృష్టించిన సంగతి తెలిసిందే.
ఆమెకు సినిమా బృందం నుంచి ఎలాంటి పరిహారం అందలేదని తర్వాత వార్తలు వచ్చాయి.మరి మల్లేష్ కు చివరికి చిల్లిగవ్వ కూడా దక్కకుండా పోతుందా అనేది చూడాలి.







