శంకర్ దాదా ఎంబిబిఎస్,మురారి, ఇంద్ర( Indra ), మన్మధుడు, పల్నాటి బ్రహ్మనాయుడు,ఖడ్గం వంటి సినిమాల్లో నటించి సౌత్ లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సోనాలి బింద్రే( Sonali Bendre ) అంటే ప్రత్యేకపరిచయాలు అక్కర్లేని హీరోయిన్.ఈమె బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలోనే సౌత్ కి ఎంట్రీ ఇచ్చి సౌత్ లో కూడా చాలా మంచి గుర్తింపు సంపాదించుకుంది.
అయితే అలాంటి ఈ హీరోయిన్ ని ఓ పాక్ క్రికెటర్ కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారట.మరి ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరు.
ఎందుకు దొంగచాటుగా కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

పాకిస్తాన్ క్రికెటర్ షోయాబ్ అక్తార్( Shoaib Akhtar ) అంటే క్రికెట్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు.అయితే ఈయనకు నటి సోనాలి బింద్రే అంటే చాలా ఇష్టమట.ఈమె మీద ఉన్న ఇష్టంతో తన పర్సులో ఈమె ఫోటోలు కూడా పెట్టుకొని తిరుగుతాడట.
అయితే సోనాలి బింద్రే మీద పిచ్చి ప్రేమ పెంచుకున్న షాయాబ్ అక్తర్ ఎలాగైనా ఆమెను కలిసి తన ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారట.
కానీ అది కుదరకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ మేనేజ్మెంట్( Pakistan Cricket Management ) తో కలిసి ఈ విషయం గురించి చెప్పి ఎలాగైనా తనని ఒకసారి సోనాలి బింద్రే ని కలిసేలా చేయండి అని రిక్వెస్ట్ చేశారట.
ఇక ఈయన పెట్టిన రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన పాకిస్తాన్ క్రికెట్ మేనేజ్మెంట్ సోనాలి బింద్రే ను కలిసేలా ఏర్పాట్లు చేశారట.ఇక ఈ విషయం తెలిసి షోయాబ్ అక్తర్ సోనాలిని కలవడంతోనే తన ప్రేమ విషయం చెప్పి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారట.
అంతేకాదు ఒకవేళ సోనాలి తన ప్రేమను అంగీకరించకపోతే కిడ్నాప్ చేసి అయినా సరే పెళ్లి చేసుకోవాలి అని భావించారట.

కానీ ఈయనకు సోనాలి బింద్రేను కలిసే అవకాశం రాలేదు.ఇక ఎన్నో కలలు కన్నప్పటికీ తన ఆశలు అడియాశలు అయ్యాయి.అయితే షోయాబ్ అక్తర్ ఈ మధ్యకాలంలో పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో సోనాలి బింద్రే మీద ఉన్న తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఆమె ఒప్పుకోకపోతే కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకునే వాడినని,అలాగే తనది వన్ సైడ్ లవ్( One Side Love ) మాత్రమే అని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.







