సరిహద్దు చెక్ పోస్ట్ ల వద్ద అప్రమత్తంగా ఉంటూ క్షుణ్ణంగా తనిఖీ చేయాలి

ఎన్నికల కోడ్( Election Code ) అమలులోకి వచ్చిన నుండి జిల్లాలో 40,54,585-/ రూపాయల నగదు స్వాధీనం.ఫాజుల్ నగర్ చెక్ పోస్ట్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( Akhil Mahajan ).

 Be Vigilant And Check Thoroughly At The Border Check Posts-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లా: సాధారణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ రోజు సాయంత్రం జిల్లా ఎస్పీ వేములవాడ పరిధిలోని ఫాజుల్ నగర్ చెక్ పోస్ట్ తనిఖీ చేసి వాహన తనిఖీలు( Vehicle inspections ) చేసి వాహనాలను నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించడంతో పాటు, ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహారించందంతో పాటు, వాహనాలను క్షుణ్ణముగా తనిఖీ చేసి అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలని సూచించారు.

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు జిల్లాలో 40,54,585-/ రూపాయలు స్వాధీనం చేసుకోని జిల్లా గ్రీవెన్స్ కమిటీకి( Grievance Committee ) అప్పగించడం జరిగిందని అన్నారు.ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100 కి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని సూచించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన, ఎన్నికల నియమావళి ప్రకారం ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఎస్పీ వెంట డీఎస్పీ నాగేంద్రచారి ,చెక్ పోస్ట్ సిబ్బంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube