సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లు స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని స్క్రిప్టులను రెడీ చేసుకుంటున్నారు కళ్యాణ్ కృష్ణ, సుధీర్ వర్మ( Sudheer Varma ) లాంటి డైరెక్టర్లు ముందు వరుసలో ఉన్నారు.ఇప్పటికే కళ్యాణ్ కృష్ణ( Kalyan krishna ) తీసిన బంగరాజ్ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆయన ప్రస్తుతం చిరంజీవి, సిద్దు జొన్నలగడ్డ లాంటి స్టార్ హీరోలని మెయిన్ లీడ్ లో పెట్టి ఒక సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఇదే క్రమంలో ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విధంగా చిరంజీవి( Chiranjeevi ) దానికి సంబంధించిన పనులు కూడా శరవేగంగా నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది.కానీ ప్రస్తుతం చిరంజీవి వశిష్ట డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.ఆ సినిమా స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే సుధీర్ వర్మ రీసెంట్ గా రవితేజ తీసిన రావణాసుర సినిమా ప్లాప్ అయింది.అయినప్పటికీ ఆయన తన నెక్స్ట్ సినిమాని పవన్ కళ్యాణ్ తో తీయబోతున్నట్టుగా తెలుస్తుంది.
కానీ ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ వరుస సినిమాతో బిజీగా ఉండడం వల్ల ఆయన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కమిట్ అయిన సినిమాలు చేయడానికి రెండు సంవత్సరాలు పదుతుంది.ఈ రెండు సంవత్సరాల గ్యాప్ లో ఆయన మరో సినిమా చేస్తే బాగుంటుందని ఆయన అభిమానులు కూడా ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక దానికి తోడుగా ఆయన ఒక యంగ్ హీరోతో ఒక సినిమా చేసి తనని తాను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకొని పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.ఇక ఈ క్రమంలోనే చాలామంది యంగ్ హీరోలకి సుధీర్ వర్మ కథలు కూడా చెబుతున్నట్టు గా తెలుస్తుంది…
.