ఓ వృద్ధ జంటకు కొంత సొమ్ము జమ చేస్తే పెద్ద మొత్తంలో PF డబ్బులు( PF money ) అందుకోవచ్చు అంటూ మాయ మాటలు చెప్పి సైబర్ నేరగాళ్లు ఎరవేశారు.వీరి మాటలను నమ్మిన వృద్ధ జంట సైబర్ నేరగాళ్లు( Cyber criminals ) చెప్పిన విధంగానే విడతల వారీగా రూ.4.35 కోట్లు చెల్లించారు.ఈ వ్యవహారం అంతా ఈ ఏడాది మే నుంచి సెప్టెంబర్ లో జరిగింది.తాము మోసపోయామని గ్రహించిన ఆ వృద్ధ జంట ముంబైలోని కఫ్ పరేడ్ పోలీసులను ఆశ్రయించారు.
దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అసలు ఏం జరిగిందంటే.ముంబై కి చెందిన 70 ఏళ్ల వృద్ధ వ్యక్తి ప్రముఖ ఐటీ, కన్సల్టింగ్ కంపెనీలో ఉద్యోగం చేసి రిటైర్డ్అయ్యాడు.అయితే ఆ వృద్ధుని భార్యకు గుర్తుతెలియని ఓ మహిళ ఫోన్ చేసి తాను ఎంప్లాయిస్ ప్రాఫిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి ఫోన్ చేస్తున్నానని నమ్మించి ఆమె భర్తకు సంబంధించిన వివరాలన్నీ చెప్పి ఆ వృద్ధురాలిని పూర్తిగా నమ్మించింది.

మీ భర్త PF ఖాతాలో 20 ఏళ్ల కాలానికి కంపెనీ రూ.4 లక్షలు డిపాజిట్ చేసిందని, ఆ డిపాజిట్ మెచ్యూర్ అయితే సుమారుగా రూ.11 కోట్లు వస్తాయని నమ్మించింది.అయితే అందుకోసం TDS, GST, income tax చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది.
ఈ విషయాలను నమ్మిన ఆ వృద్ధ మహిళ కాలర్ చేసిన మహిళ చెప్పినట్లుగా బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ చేసింది.ఇలా మే నుంచి సెప్టెంబర్ వరకు విడతల వారీగా రూ.4.35 కోట్లు బ్యాంక్ ఖాతాలో జమ చేసింది.ఇంకా డబ్బులు డిపాజిట్ చేయాలని కాలర్ ఆ వృద్ధ మహిళను డిమాండ్ గా అడగడం, డబ్బు డిపాజిట్ చేయకపోతే ఐటీ శాఖకు సమాచారం ఇస్తామని బెదిరించడం చేసింది.దీంతో మోసపోయామని గ్రహించిన ఆ వృద్ధ జంట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు( police ) కేసు నమోదు చేసుకుని అన్నీ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.







