తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులలో బ్రహ్మాజీ( Brahmaji ) ఒకరు…ఈయన తెలుగులో చాలా సినిమాల్లో నటించి నటుడుగా తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.సింధూరం లాంటి సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ ఆయనకి హీరోగా అంత మంచి గుర్తింపు అయితేరాలేదు.
దాంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన మార్క్ నటన ని చూపిస్తూ తనకంటూ ప్రత్యేకమైన పాత్రలను పోషిస్తూ వస్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన చాలా సినిమాల్లో పాత్రలు వైవిధ్యంగా ఉంటూనే ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ ఉంటాయి.ఇక అలాంటి బ్రహ్మాజీ తెలుగు లో స్టార్ హీరోల అందరి సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తూ ఉంటారు.
అంటే టాలీవుడ్ ( Tollywood )లో ఉన్న డైరెక్టర్లు అందరూ కూడా బ్రహ్మాజీ కోసం సపరేట్ గా క్యారెక్టర్ ని సృష్టించి ఆయన్ని ఆ క్యారెక్టర్ లో నటింపజేసెలా ప్రయత్నం చేస్తూ ఉంటారు.ఎందుకంటే బ్రహ్మాజీ అటు కమెడియన్ పాత్ర( Comedian character )లో గాని, విలన్ పాత్రలో గానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గానీ కరెక్ట్ గా సరిపోతాడు కాబట్టి బ్రహ్మాజీ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగానే క్యారెక్టర్ ను డిజైన్ చేస్తూ డైరెక్టర్లు ఆయనని చాలా బాగా వాడుకుంటూ ఉంటారు.అందుకే బ్రహ్మాజీ మంచి పాత్రల్లో నటిస్తూనే తనకు గుర్తింపు వచ్చే పాత్రలో కూడా నటిస్తూ ఆ క్యారెక్టర్లు తను తప్ప వేరే వాళ్ళు చేయలేరు అన్నట్టుగా నటించి మెప్పిస్తూ ఉంటాడు.
ఇక ఇది ఇలా ఉంటే ఈ సమయంలో బ్రహ్మాజీ లాంటి ఒక నటుడు ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి.ఎందుకంటే ఆయన ఒక క్యారెక్టర్ అని కాకుండా డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో నటించడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు…ఇక ఇలాంటి క్రమం లో బ్రహ్మాజీ లాంటి నటుడు వరుసగా సినిమాలు చేయాలని కోరుకుందాం…
.