భారత జట్టు మాజీ దిగ్గజం, క్రికెట్ దేవుడు గా ప్రత్యేక గుర్తింపు పొందిన సచిన్ టెండుల్కర్ విగ్రహ ఆవిష్కర( Sachin Tendulkar Statue )ణ, భారతదేశంలోని ప్రముఖ స్టేడియాలలో ఒకటైన వాఖండే మైదానంలో ఏర్పాటు చేసేందుకు అన్ని పనులు పూర్తయ్యాయి.నవంబర్ ఒకటవ తేదీ సచిన్ టెండూల్కర్ విగ్రహ ఆవిష్కరణ జరగనుంది.
నవంబర్ రెండవ తేదీ భారత్-శ్రీలంక మధ్య వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్ కు, సచిన్ టెండూల్కర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధం ఏమిటో అనే వివరాలు చూద్దాం.

2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్-శ్రీలంక మధ్య వాఖండే స్టేడియం వేదికగా జరిగింది.ఈ విషయం అందరికీ తెలిసిందే.ఈ మ్యాచ్లో శ్రీలంకను ఓడించిన భారత్ టైటిల్ కైవసం చేసుకుంది.దాదాపుగా 28 ఏళ్ల తర్వాత రెండోసారి వన్డే వరల్డ్ కప్ టైటిల్ ను భారత్ ముద్దాడింది.
ఈ ప్రపంచకప్ గెలిచిన జట్టులో సచిన్ టెండుల్కర్ ఉన్నాడు.తన ఆరో ప్రపంచకప్ లో మాస్టర్ బ్లాస్టర్ తన చిరకాల స్వప్నాన్ని అందుకున్నారు.
అందుకే ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ లో భాగంగా నవంబర్ 2న భారత్-శ్రీలంక మ్యాచ్ కు ఒక రోజు ముందు వాఖండే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు.

అంతేకాకుండా నవంబర్ 2వ తేదీ భారత్-శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్ తర్వాత ఓ సరికొత్త నిర్ణయం అమల్లోకి రానుంది.నవంబర్ 2వ తేదీ నుంచి వాఖండే స్టేడియం(W ankhede Stadium )లో జరిగే మిగిలి ఉన్న ప్రపంచ మ్యాచ్లలో అభిమానులు ఉచితంగా కూల్ డ్రింక్స్, పాప్ కార్న్ పొందవచ్చు.క్రికెట్ ప్రేక్షకులు తమ టికెట్లను చూపించి ఉచితంగా వీటిని పొందవచ్చు.
సచిన్ టెండుల్కర్ విగ్రహాన్ని అహ్మద్ నగర్ కు చెందిన ప్రసిద్ధ కళాకారుడు ప్రమోద్ కాంబ్లే ( Pramod Kamble )రూపొందించారు.సచిన్ టెండుల్కర్ స్టాండ్ సమీపంలో విగ్రహాన్ని ఉంచనున్నారు.
ఈ కార్యక్రమంలో సచిన్ టెండుల్కర్ తో పాటు భారత జట్టు సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొంటారని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే తెలిపారు.







