మళ్లీ పెరుగుతున్న విద్వేష దాడులు .. రక్షణ కల్పించండి : న్యూయార్క్‌లో సిక్కు కమ్యూనిటీ నిరసన

ఇటీవలి కాలంలో అమెరికాలో సిక్కులపై( Sikhs in America ) మళ్లీ విద్వేషదాడులు పెరుగుతూ వుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.న్యూయార్క్ సిటీ బస్సులో గత వారం 19 ఏళ్ల సిక్కు సంతతి యువకుడిపై ఓ దుండగుడు దాడి చేయడంతో పాటు అతని తలపాగా లాగేందుకు యత్నించాడు.

 Sikh Community Calls On New York City For Protection After 2 Recent Attacks , S-TeluguStop.com

ఈ ఘటనను మరిచిపోకముందే అదే న్యూయార్క్ నగరంలో( New York City ) సిక్కు సంతతికి చెందిన వృద్ధుడిని ఓ అగంతకుడు కొట్టి కొట్టి చంపాడు.వరుస ఘటనల నేపథ్యంలో అమెరికాలో వున్న సిక్కులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలంటూ సిక్కులు న్యూయార్క్‌లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

రిచ్‌మండ్ హిల్‌లోని సిక్కు దేవాలయం( Sikh Temple in Richmond Hill ) ముందు, సిక్కు సంఘం, స్థానిక నాయకులు గుమిగూడారు.

గత వారం ఎంటీఏ బస్సులో విద్వేష దాడికి గురైన మణిసింగ్ సంధు( Manising Sandhu ) మాట్లాడుతూ.ఇంటి నుంచి అడుగు బయటపెడితే తనకు సురక్షితంగా అనిపించడం లేదన్నారు.

దుండగుడి దాడిలో ప్రాణాలు కోల్పోయిన జస్మర్ సింగ్ కుమారుడు సుబేగ్ ముల్తానీ( Subeg Multani ) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.అతను తన తండ్రిని తీవ్రంగా కొట్టాడని.

ఘటనలో ఆయన రెండు దంతాలను కూడా వైద్యులు తొలగించారని ముల్తానీ చెప్పారు.అయితే ఈ దాడిని ద్వేషపూరిత నేరంగా పరిగణించనందుకు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ రోజున తన తండ్రి తలపాగా ధరించాడని.దాడి చేసిన వ్యక్తి ‘‘టర్బన్ మ్యాన్’’ అనే పదాన్ని ఉపయోగించాడని సుబేగ్ తెలిపారు.

అందుచేత దీనిని విద్వేషనేరంగా పరిగణించాలని ఆయన కోరుతున్నారు.

Telugu Japneet Singh, Jasmar Singh, Sandhu, York, Sikhtemple, Sikhs America, Sub

స్థానిక కార్యకర్త జప్నీత్ సింగ్ మాట్లాడుతూ.సిక్కులపై ద్వేషపూరిత నేరాలు పెరుగుతున్నాయని తెలిపారు.కొన్ని నేరాలు బయటకు రావడం లేదని, న్యూయార్క్ పోలీసు శాఖ కూడా వీటిని సరిగా దర్యాప్తు చేయడం లేదని ఆయన ఆరోపించారు.

తమకు తాముగా గస్తీ బృందాన్ని ఏర్పాటు చేసుకుంటామని.పౌరులు స్వచ్ఛందంగా గస్తీ నిర్వహించే ప్రాంతాల్లో నేరాలు తగ్గుముఖం పట్టాయని జప్నీత్ తెలిపారు.

Telugu Japneet Singh, Jasmar Singh, Sandhu, York, Sikhtemple, Sikhs America, Sub

మరోవైపు.సిక్కులపై పెరుగుతున్న దాడులను న్యూజెర్సీ రాష్ట్రంలోని హోబోకెన్ నగర మేయర్, సిక్కు సంతతికి చెందిన రవి భల్లా( Ravi Bhalla ) ఖండించారు.ద్వేషం, హింస అనేవి ఖండించదగిన చర్యలని… ఇవి ఐక్యత, వైవిధ్యం, అంగీకారంతో కూడిన అమెరికన్ విలువల గుండెపై దాడి చేస్తాయని రవి భల్లా వ్యాఖ్యానించారు.ఈ పరిస్థితుల్లో అందరూ ఒక్కటై స్నేహపూరిత వాతావరణాన్ని పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఒక ప్రభుత్వ అధికారిగా, హోబోకెన్ మేయర్‌గా.ద్వేషం, అసహనం, వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తుతానని, చర్యలు తీసుకుంటానని రవి ఎస్ భల్లా ప్రతిజ్ఞ చేశారు.

వైవిధ్యమే మా బలం అని గుర్తుంచుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube