భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ ( Electric scooter )తయారీ సంస్థ అయిన ఓలా విక్రయాల విషయంలో సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది.తాజాగా ఈ కంపెనీ ఎలక్ట్రిక్, దసరా, నవరాత్రి పండుగల సీజన్‌లో రికార్డు స్థాయిలో అమ్మకాల పనితీరును నమోదు చేసింది.
ఎక్స్ (ట్విటర్ కొత్త పేరు)లో ట్వీట్ పోస్ట్ చేసి ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ ( Bhavish Agarwal )ఈ విషయాన్ని వెల్లడించారు, కంపెనీ ప్రతి 10 సెకన్లకు ఒక స్కూటర్‌ను విక్రయిస్తోందని, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 250% పెరిగిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) పెరుగుతున్న డిమాండ్ ఈ విజయానికి కారణమని అగర్వాల్ పేర్కొన్నారు.ఈ పండుగ సీజన్ దేశానికి “ఈవీ మూమెంట్”ని సూచిస్తుందని పేర్కొన్నారు ఈ ట్వీట్ చూశాక నెటిజన్లు ఆశ్చర్యపోయారు.సక్సెస్ అంటే ఇదే కదా అని వారు కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించేందుకు, ఓలా ఎలక్ట్రిక్ తన స్కూటర్లపై పలు ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రారంభించింది.వాటిలో కొన్ని ప్రయోజనాలు చూసుకుంటే.పాత పెట్రోల్ స్కూటర్లకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, 5 సంవత్సరాల బ్యాటరీ వారంటీ, ఓలా S1పై రూ.7,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్, జీరో డౌన్‌పేమెంట్, జీరో కాస్ట్ ఈఎంఐ, జీరో ప్రాసెసింగ్ ఫీజు వంటివి ఉన్నాయి.ఓలా ఎలక్ట్రిక్ మూడు మోడల్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి, ఇవి వివిధ వర్గాల వినియోగదారులను అందిస్తాయి.ఆ స్కూటర్లు ఏంటో తెలుసుకుంటే.

– S1 ప్రో ప్రీమియం మోడల్ ధర రూ.1.47 లక్షలు ఉండగా ఇది 4 kWh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 195 కి.మీ రేంజ్, 120 kmph గరిష్ట వేగాన్ని అందిస్తుంది.
– S1 ఎయిర్ ధర రూ.1.19 లక్షలు కాగా.ఇది 3 kWh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 151 కి.మీ రేంజ్, 90 kmph గరిష్ట వేగాన్ని అందిస్తుంది.
– బడ్జెట్ మోడల్ S1 ఎక్స్ ధర రూ.89,999.ఇది రెండు 2 kWh, 3 kWh వంటి బ్యాటరీ ఎంపికలను కలిగి ఉంది, ఇవి గరిష్టంగా 151 కి.మీ పరిధిని, గరిష్టంగా 90 kmph వరకు వేగాన్ని అందిస్తాయి.ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలోని మరో ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ నుండి పోటీని ఎదుర్కొంటోంది.
ఏథర్ ఎనర్జీ కూడా కొనుగోలుదారులకు తగ్గింపులు, ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది.








