హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా.. కొంప మునిగినట్లే..

ఈ రోజుల్లో సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు చాలా మంది లోన్లపై ఆధారపడుతున్నారు.అయితే ఆ క్రమంలో వారు కొన్ని తప్పులు చేస్తూ ఆర్థికంగా చితికి పోతున్నారు.

 Dont Do These Mistakes While Taking Home Loan Details, Home Loan, Down Payment,-TeluguStop.com

ముఖ్యంగా ఓ విషయంలో మిస్టేక్ చేసి అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు.ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.75 లక్షలతో ఇంటిని కొనుగోలు చేశాడనుకుందాం.దాని కోసం అతను ఏకంగా రూ.60 హోమ్ లోన్( Home Loan ) తీసుకొని 35 నెలల పాటు ప్రతి నెలా రూ.45,500 ఈఎంఐగా చెల్లించాడని ఊహించుకుందాం.అంటే దాదాపు అతడు ఈఎంఐ రూపంలో రూ.15 లక్షల వరకు తిరిగి కట్టాడని చెప్పుకోవచ్చు కానీ బ్యాంకుకి అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంకా రూ.57 లక్షలు బాకీ ఉంటాడు.అతని రుణ కాలపరిమితి కూడా 20 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెరుగుతుంది.

ఇలా ఎందుకు జరిగింది? అనే కదా మీ ప్రశ్న! దానికి సమాధానం ఇటీవల కాలంలో వడ్డీ రేట్లను( Interest Rates ) భారీగా పెంచడమే అని చెప్పుకోవచ్చు.గతంలో రుణ గ్రహీతలు హోమ్ లోన్ తీసుకున్నప్పుడు వార్షిక వడ్డీ రేటు 6.75 శాతం ఉండొచ్చు కానీ ఆర్‌బీఐ రెపో రేటు( RBI Repo Rate ) మార్పుల కారణంగా చాలాసార్లు మారిపోయింది.ఇప్పుడు అది సంవత్సరానికి 9.45 శాతానికి చేరుకుంది.అంటే రుణ గ్రహీత ఈఎంఐలో ఎక్కువ భాగం అసలు చెల్లించడానికి కాకుండా వడ్డీని చెల్లించడానికి వెళ్తుంది.పైన చెప్పిన ఉదాహరణ ప్రకారం చూసుకుంటే రుణ గ్రహీత మొదటి ఏడాది అసలు రుణంలో రూ.1.45 లక్షలు కట్టగలిగాడు.రెండో సంవత్సరంలో రూ.1.05 లక్షలు, మూడో సంవత్సరంలో కేవలం రూ.40,000 మాత్రమే కట్టగలిగాడు.మిగతాదంతా వడ్డీకే వెళ్లిపోయింది.

అందుకే హోమ్ లోన్ తీసుకునేటప్పుడు సొంత డబ్బు కాకుండా మొత్తం లోన్‌పైనే ఆధారపడితే అది పెద్ద పొరపాటు అవుతుంది.

Telugu Loan, Interest, Ltv Ratio, Personal, Rbi Repo-General-Telugu

పైన చెప్పిన ఉదాహరణ ఒక్కటే కాదు, చాలా మంది గృహ రుణగ్రహీతలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యకు ఒకటే పరిష్కారం.అదేంటంటే వడ్డీ రేట్లు పెరిగినప్పుడు తక్కువ రుణం తీసుకుని, ఎక్కువ ఈఎంఐ( EMI ) చెల్లించడం ద్వారా వడ్డీ భారాన్ని నివారించవచ్చు.

ముఖ్యంగా డౌన్ పేమెంట్ గా( Down Payment ) వీలైనంత ఎక్కువగా చెల్లించేలా చూసుకోవాలి.డౌన్ పేమెంట్ ఎక్కువగా ఉంటే లోన్ అమౌంట్ తక్కువగా ఉంటే వడ్డీ రేటు కూడా తగ్గుతుంది.

అలాగే తక్కువ సమయంలో చెల్లించేలా లోన్ తీసుకుంటే వడ్డీ భారం పెద్దగా పడదు.

Telugu Loan, Interest, Ltv Ratio, Personal, Rbi Repo-General-Telugu

డౌన్ పేమెంట్ అంటే మీరు ఇల్లు కొనడానికి మీ సొంత జేబు నుండి చెల్లించే డబ్బు.రుణదాత మిగిలిన డబ్బును ఇంటి రుణంగా విక్రేతకు చెల్లిస్తాడు.కనీస డౌన్ పేమెంట్ సాధారణంగా ఇంటి విలువలో 10 శాతం నుంచి 20 శాతం వరకు ఉంటుంది.

ఇది లోన్ మొత్తం, లెండర్ రూల్స్, క్రెడిట్ స్కోర్ మొదలైన అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది.

గృహ కొనుగోలుదారులకు రుణదాతలు ఎంత మొత్తంలో రుణాలు ఇవ్వవచ్చనే దాని కోసం ఆర్‌బీఐ నియమాలు, మార్గదర్శకాలను కూడా రూపొందిస్తుంది.

గృహ రుణాలు సాధారణంగా 80 శాతం వరకు లోన్-టు-వాల్యూ నిష్పత్తితో ఇవ్వబడతాయి.ఇది రుణ మొత్తానికి, ఇంటి విలువకు గల నిష్పత్తి.

లోన్-టు-వాల్యూ 80 శాతం అయితే, మీరు 20 శాతం డౌన్ పేమెంట్‌గా చెల్లిస్తారు, రుణదాత 80 శాతం రుణంగా చెల్లిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube