మంచు మనోజ్ వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు చాలా కాలంగా దూరంగా ఉంటున్నాడు.ఎట్టకేలకు ఆయన సినిమా ల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు… ఆయన అహం బ్రహ్మాస్మి( Aham Brahmasmi ) అనే సినిమా తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది.
ప్రచారం జరిగినట్లుగానే ఆ సినిమా ను మంచు మనోజ్( Manchu Manoj ) అధికారికంగా ప్రకటించాడు.సినిమా ప్రారంభోత్సవం కూడా భారీ ఎత్తున జరిగింది.
ఆహా.ఓహో అన్నట్లుగా సినిమా గురించి ప్రచారం నిర్వహించారు.ప్రముఖులు సినిమా ప్రారంభోత్సవం కు హాజరు అయ్యారు.తీరా చూస్తే ఇప్పుడు సినిమా ను పక్కన పెట్టేశారు.

ఆ చిత్ర దర్శకుడు శ్రీకాంత్( Director Srikanth ) తాజాగా మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో( Vaishnav Tej ) కలిసి ఆదికేశవ సినిమా ను ( Adikeshava Movie ) చేశాడు.ఆ సినిమా మొదటి పాట విడుదల కార్యక్రమం జరిగింది.ఆ సందర్భంగా దర్శకుడు మీడియా తో మాట్లాడుతూ అహం బ్రహ్మాస్మి సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు.ఆ సమయం లో మంచు మనోజ్ వ్యక్తిగతంగా కాస్త ఇబ్బందిగా ఉన్నాడు.
ఆయన ఆ సమయం లో సినిమా ను చేయలేని పరిస్థితి ఉంది.కనుక కొంత సమయం తీసుకుందాం అని నాతో అన్నాడు.
తప్పకుండా మా ఇద్దరి కాంబోలో ఆ సినిమా ఉంటుంది.

ఇప్పటికి కూడా మనోజ్ అన్న వద్దే ఆ కథ ఉందని దర్శకుడు చెప్పుకొచ్చాడు.ఒక టీవీ షో తో మంచు మనోజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.అయితే మంచు మనోజ్ సినిమా విషయం లో మాత్రం ఆసక్తి చూపిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.
దాంతో మంచు మనోజ్ ముందు ముందు అయినా అహం బ్రహ్మాస్మి సినిమా ను చేస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం దర్శకుడు శ్రీకాంత్ చేస్తున్న ఆదికేశ సూపర్ హిట్ అయితే వెంటనే మనోజ్ నుంచి అహం బ్రహ్మాస్మి సినిమా కోసం పిలుపు వచ్చే అవకాశాలు ఉన్నాయని దర్శకుడు ఆశ పడుతున్నాడు.
మరి ఏం జరగబోతుందో చూడాలి.