చెక్కు చెదరని 'జైలర్' రికార్డు..విజయ్ ఫ్యాన్స్ పరువు తీసేసిన 'బుక్ మై షో'

ఈ ఏడాది విడుదలైన సినిమాలలో సౌత్ ఇండియా మొత్తాన్ని షేక్ చేసిన చిత్రాలలో ఒకటి సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ‘జైలర్( Jailer ) ‘.‘డాక్టర్’ మరియు ‘బీస్ట్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన నెల్సన్ చేసిన చిత్రం ఇది.ఇందులో రజినీకాంత్ ( Rajinikanth )ని అత్యంత పవర్ ఫుల్ గా చూపించాడు.ఫలితంగా నాలుగు వారాలు నాన్ స్టాప్ గా అటు తమిళనాడు లో,ఇటు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో హౌస్ ఫుల్ షోస్ పడ్డాయి.

 The Record Of 'jailer' That Didn't Break The Check Vijay S Fans Defamed Book M-TeluguStop.com

అలా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.మళ్ళీ ఈ రికార్డు ని ఏ తమిళ సినిమా అందుకుంటుందో, ఇప్పట్లో ఈ రికార్డు బ్రేక్ అవ్వడం కష్టం అని అందరూ అనుకున్నారు.

కానీ రీసెంట్ గా విడుదలైన విజయ్ ‘లియో’ చిత్రం బాక్స్ ఆఫీస్ ని డివైడ్ టాక్ తో దంచి కొట్టేసింది.

Telugu Show, Kollywood, Leo, Rajinikanth, Tollywood, Trisha, Vijay-Movie

ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఈ సినిమాకి ఇప్పటి వరకు 450 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.నిర్మాతలు కూడా ఈ నంబర్స్ ని చెప్పుకుంటూ వచ్చారు.కానీ బుక్ మై షో అప్పట్లో ‘జైలర్’ విషయం లో ఇచ్చిన లెక్కల ప్రకారం ఆ చిత్రానికి మొదటి ఆరు రోజుల్లో 6 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయాయట.అదే బుక్ మై షో ఇప్పుడు ‘లియో’ టికెట్స్ సేల్స్ మీద కూడా అధికారికంగా ఒక ప్రకటన చేసింది.‘లియో( Leo )’ చిత్రానికి ఇప్పటి వరకు బుక్ మై షో ద్వారా 5.6 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయాయి అంటూ ఒక ట్వీట్ వేసింది.ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం.

రజిని ఫ్యాన్స్ జైలర్ రికార్డు ఇంకా చెక్కు చెదరలేదు అంటూ ట్వీట్స్ వేస్తున్నారు.మరో పక్క విజయ్ ఫ్యాన్స్ ఇదంతా ఫేక్, రోజువారీ బ్రేకప్ పెట్టండి అంటూ రజిని ఫ్యాన్స్ ని డిమాండ్ చేస్తున్నారు.

Telugu Show, Kollywood, Leo, Rajinikanth, Tollywood, Trisha, Vijay-Movie

జైలర్ చిత్రం కంటే తక్కువ అమ్ముడుపోయిన ఈ చిత్రానికి జైలర్ కంటే ఎక్కువగా మొదటి వారం వసూళ్లు ఎలా వచ్చాయి?, ఇదంతా ఫేక్ కలెక్షన్స్ యేనా అంటున్నారు నెటిజన్స్.కానీ ఓవర్సీస్ లో ‘లియో’ చిత్రానికి జైలర్ కంటే అధికంగా నాలుగు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం 32 కోట్ల రూపాయిల పైమాటే అన్నమాట.అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘లియో‘ చిత్రం జైలర్ కి సరిసమానమైన వసూళ్లను మొదటి వారం లో సొంతం చేసుకుందికి.

ఇక కేరళ లో అయితే జైలర్ క్లోసింగ్ కలెక్షన్స్ ని వారం లోపే దాటేసింది.తమిళనాడు లో కూడా ఈ చిత్రానికి వారం లోపే 170 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

కాబట్టి గ్రాస్ ఆ స్థాయిలో ఉండడం తప్పు లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు ట్రేడ్ పండితులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube