గోవాలోని 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ( IFFI )లో తెలుగు సినిమాలు లేకపోవడం పట్ల టాలీవుడ్ ప్రేక్షకులు తమ నిరాశ, నిస్పృహను వ్యక్తం చేస్తున్నారు.ఫెస్టివల్‌లోని ఇండియన్ పనోరమా విభాగానికి నిర్మాతలు సమర్పించిన కొన్ని తెలుగు చిత్రాల పేర్లను కూడా వారు ప్రస్తావించారు, విరూపాక్ష, వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, కార్తికేయ 2, బేబీ, సార్, రైటర్ పద్మనాభం ఇలా టాలీవుడ్ నుంచి చాలానే సినిమాలను నిర్మాతలు పంపించారు.
అయితే అన్ని భారతీయ భాషల నుంచి ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 25 చిత్రాలను ఎంపిక చేశారు.దురదృష్టం ఏంటంటే వాటిలో ఒక్క తెలుగు సినిమా కూడా ఎంపిక కాలేదు.
తెలుగు సినిమాల గొప్పతనం ఇదేనా? ఫిలిం ఫెస్టివల్ లో మనది ఒక్కటి కూడా సెలెక్ట్ కావకపోవడమేంటని టాలీవుడ్ ప్రేక్షకులు విమర్శలు చేస్తున్నారు.

‘ప్రజాకవి కాళోజీ’ 2022, ఆగస్టు 15 లోపు సెన్సార్ కానందున పోటీకి అర్హత సాధించలేదని వారు అంటున్నారు.వచ్చే ఏడాది పంపాలని కోరుతున్నారు.తెలుగు సినిమాల ఎంపిక ప్రక్రియను, నాణ్యతను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
కొన్ని తెలుగు సినిమాలను ఎంపిక చేసినా అవార్డులు దక్కించుకోలేవని, ఇది ఆస్కార్ యొక్క విశ్వసనీయతను కూడా ప్రశ్నిస్తుందని, దాని లోపాలను బహిర్గతం చేస్తుందని ఫ్యాన్స్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారుతెలుగు సినిమాలను ఇతర ప్రాంతీయ సినిమాలతో పోల్చుతూ, అవి జ్యూరీలకు లేదా బయటి వ్యక్తులకు నచ్చని అవాస్తవిక, రొటీన్ రొడ్డ కొట్టుడు కథలతో వస్తాయని మరికొందరు ఏకిపారేస్తున్నారు.కొందరు మాత్రం టాలీవుడ్ సినిమాలు బాగానే ఉంటాయని సెలక్షన్ కమిటీ పక్షపాతంగా, రాజకీయంగా వ్యవహరిస్తోందని, కొన్ని కారణాల వల్ల కన్నడ, మలయాళ సినిమాలను ఎక్కువగా ఎంపిక చేశారని ఆరోపించారు.
విరూపాక్ష సినిమా( Virupaksha ) మంచి కథతోనే వచ్చిందని, ఆ సినిమాని ఎలా సెలెక్ట్ చేయకుండా ఉంటారని మరికొందరు ఫైర్ అవుతున్నారు.కార్తికేయ 2( Karthikeya 2 ) కూడా పర్లేదు అనిపించింది.

గతేడాదిలో రిలీజ్ అయిన సీతారామం( Sita Ramam ) అనే తెలుగు సినిమాకి కూడా ప్రశంసలు, మంచి కలెక్షన్స్ వచ్చాయి.ఆ సినిమాని కూడా నిర్మాతలు సబ్మిట్ చేశారు.అందులో తెలుగు హీరో నటించలేదని కానీ లవ్ స్టోరీ మాత్రం బాగుంది.అది కూడా తెలుగు సినిమా పరువు నిలబెట్టలేకపోయింది.







