మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ లో ఎటువంటి లోపం లేదని ఈఎన్సీ మురళీధర్ రావు అన్నారు.ఒకవేళ డిజైన్ లో లోపం ఉంటే వరదలను తట్టుకునేది కాదని చెప్పారు.
ఇసుక వలన సమస్య వచ్చిందని అనుకుంటున్నామని ఈఎన్సీ మురళీధర్ రావు తెలిపారు.ఏడవ బ్లాక్ లో సమస్య రావడంతో పిల్లర్ కుంగిపోయిందన్న ఆయన ప్రాథమిక విచారణ చేశామన్నారు.
ఈ క్రమంలో పూర్తి నివేదిక వచ్చిన తరువాత ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుస్తుందని పేర్కొన్నారు.అదేవిధంగా కాఫర్ డ్యాం నిర్మాణం నవంబర్ చివరి వారంలో చేపడతామని వెల్లడించారు.







