వైరల్: అత్యాశకు పోయి ప్రాణం మీదకు తెచ్చుకున్న కొండచిలువ.. జరిగిందిదే?

సోషల్ మీడియా ప్రతీ ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తరువాత రకరకాల వీడియోలు ఇక్కడ వైరల్ అవడం మనం చూస్తూ వున్నాం.ఈ మధ్య కాలంలో ముఖ్యంగా జంతువులకు సంబందించినవి నెటిజన్లు ఎక్కువగా చూస్తుండడం మనం గమనించవచ్చు.

 Python Caught In The Trap After A Happy Meal Details, Python, Viral Latest, News-TeluguStop.com

ఇక కొండచిలువల( Python ) దాడి గురించి ప్రత్యేకంగా జనాలకి ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు.వాటి నోరు చూసేందుకు చిన్నదే అయినా పెద్ద పెద్ద జంతువులను సైతం అవి అవలీలగా మింగేస్తుంటాయి.

ఈ క్రమంలో కొన్నిసార్లు అచ్చం సినిమాల్లో చూపించినట్లుగా వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం మనం సోషల్ మీడియాలో గమనించవచ్చు.జంతువులను ( Animals ) వేటాడే క్రమంలో ప్రమాదంలో పడిపోయిన పాములు, కొండచిలువలను మీరు గమనించవచ్చు.

తాజాగా, ఇటువంటి తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.అవును, పెద్ద జంతువును మింగిన కొండచిలువకు ఊహించని సమస్య వచ్చి పడింది.సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ అవుతున్న ఆ వీడియోని ఒక్కసారి గమనిస్తే, ఓ పెద్ద కొండచిలువ వేట కోసం తచ్చాడుతూ చివరకు ఓ షెడ్డు వద్దకు చేరుకుంటుంది.ఆ తరువాత అందులో ఉన్న జంతువులను టార్గెట్ చేసి.

చివరకు చాకచక్యంగా వాటిని వేటాడింది.ఈ క్రమంలో వాటిలో ఓ పెద్ద జంతువును అవలీలగా మింగేసింది.

ఆ తర్వాతే దానికి ఊహించని సమస్య వచ్చింది.అంత పెద్ద జంతువును మింగడంతో కడుపు భారమై కదలలేక, మెదలలేక నానా తిప్పలు పడింది.

సరిగా అదే సమయంలో కంచెను దాటే క్రమంలో కొండచిలువ తల ఓ తాడులో ఇరుక్కుపోతుంది.అంతకుముందే అక్కడ ఏర్పాటు చేసిన ఓ ఉచ్చులో( Trap ) చిక్కుకుపోతుంది.తరువాత తలను అటూ ఇటూ ఊపడంతో ఉచ్చు మరింత బిగుసుకుపోతుంది.కాగా అక్కడ ఉచ్చు ఏర్పాటు చేసిన వారు అక్కడికి వచ్చి కొండచిలువను బయటికి లాగేందుకు ప్రయత్నిస్తారు.

కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించడం ఇక్కడ చూడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube