ఇండియాలో అత్యంత ఖరీదైన కారు ఇదే.. ఫీచర్స్ మాత్రం అదుర్స్..!

భారతదేశంలోని రోడ్లపై తిరిగే కార్లలో అత్యంత ఖరీదైన కారు( Costliest Car ) ఏదంటే.బెంట్లీ ముల్సాన్ EWB సెంటెనరీ ఎడిషన్.( Bentley Mulsanne Centenary Edition ) ఈ కారు ధర రూ.14 కోట్లు.అత్యంత విలాసవంతమైన ఇలాంటి లగ్జరీ కార్లు భారత దేశంలో ఎవరి వద్ద ఉంటాయంటే.మొదటగా గుర్తొచ్చేది ముఖేష్ అంబానీ లేదా అదానీ పేర్లే.కానీ ఈ కారు మాత్రం వీ.ఎస్.రెడ్డి అనే వ్యక్తి వద్ద ఉంది.తాజాగా బెంగుళూరు రోడ్లపై కనిపించిన ఈ కారు ఎవరిది అని ఆరా తీయగా.

 Bentley Mulsanne Centenary Edition Ewb Is Indias Most Expensive Super Luxury Car-TeluguStop.com

ఇండియాలోని అతి పెద్ద మెడికల్ న్యూట్రిషన్ తయారీ కంపెనీ బ్రిటిష్ బయోలాజికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ వీ.ఎస్.రెడ్డి కు చెందింది అని తెలిసింది.

Telugu Bentley, Bentleymulsanne, Indiasexpensive, Luxury Car, Reddy-Latest News

అత్యంత విలాసవంతమైన ఖరీదైన ఈ కారును ప్రముఖ ఆటోమొబైల్స్ కంపెనీ బెంట్లీ ( Bentley ) తయారుచేసింది.బెంట్లీ కంపెనీ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్పెషల్ గా కేవలం 100 ఎడిషన్లు తయారు చేసింది.అందులో ఒకటి వీ.

ఎస్.రెడ్డి( VS Reddy ) వద్ద ఉంది.ఇతనికి చిన్నప్పటినుండి ప్రపంచంలో ఉండే లగ్జరీ కార్లను సేకరించడం అలవాటు.బెంట్లీ కారును తాజ్ మహల్ ఆఫ్ కార్స్ గా పోల్చారు.ఈ బెంట్లీ ముల్సాన్ EWB సెంటెనరీ ఎడిషన్ కారు ఫీచర్స్ ఏమిటో చూద్దాం.గోల్డ్ కలర్, బ్లాక్ కలర్, వైట్ కలర్ లలో ఈ కార్లను తయారు చేశారు.

ఎక్స్ టెండెడ్ వీల్ బేస్ ను ఈ కారు కలిగిఉంది.

Telugu Bentley, Bentleymulsanne, Indiasexpensive, Luxury Car, Reddy-Latest News

ఈ కారు 6.75 లీటర్ V8 ఇంజిన్, హార్స్ పవర్ కలిగిఉండి 1020Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో కలిసి కేవలం 5.5 సెకండ్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగం వరకు స్ప్రింట్ చేయగలదు.గ్రిల్ బ్యాడ్జ్, వీల్ సెంటర్ క్యాప్స్, ట్రెడ్ ప్లేట్ లు లతో పాటు కారు లోపల సీట్లపై పైపింగ్ తో పాటు ప్రత్యేక వెనీర్లు, సెంటెనరీ బ్యాడ్జ్లు ఉన్నాయి.

పవర్-రిక్లైనింగ్ వెనుక సీట్లు, అరుదైన హైడ్ లెదర్ లో డైమండ్ క్విల్టింగ్ స్టిచింగ్ తో అమర్చబడి ఉంటాయి.ఈ కారు గంటకు 296 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube