నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారు..: కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ బస్సు యాత్రపై మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు.

 Chandrababu Is In Jail Because The Truth Has Won..: Kodali Nani-TeluguStop.com

నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైలులో ఉన్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.

భువనేశ్వరి కూడా నిజం గెలవాలి అనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకు రారని చెప్పారు.చంద్రబాబు కుటుంబం అంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయిందని తెలిపారు.రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం ప్రస్తుతం రూ.2 వేల కోట్లు దాటిందన్నారు.2019 నుంచి టీడీపీకి పవన్ తెర వెనుక మద్దతుగా ఉన్నారన్న కొడాలి నాని ఇప్పుడు ముసుగు తొలిగిందని తెలిపారు.చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ జనసున్నా పార్టీ పెట్టారని ఎద్దేవా చేశారు.

లోకేశ్ సమర్థుడు అయితే ఇంట్లో మహిళలు రోడ్లపైకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు.దీని బట్టే లోకేశ్ పప్పు అని మరోసారి రుజువైందన్నారు.

లోకేశ్ ఢిల్లీకి పారిపోయి తల్లిని రోడ్లపై తిప్పుతున్నారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube