ఏపీలో టీడీపీ - జనసేన ఐక్య కార్యాచరణ వేగవంతం

ఏపీలో టీడీపీ – జనసేన పార్టీలు స్పీడ్ పెంచాయి.ఐక్య కార్యాచరణకు పదునుపెట్టిన రెండు పార్టీలు పలు కార్యక్రమాలను నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకున్నాయి.

 Tdp-janasena Unity Activity To Speed Up In Ap-TeluguStop.com

ఈ మేరకు ఈనెల 29 నుంచి 31 వ తేదీ వరకు జిల్లా స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నాయి.ఇందులో భాగంగా 29న శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, ప్రకాశం మరియు అనంతపురం జిల్లాల సమన్వయ సమావేశాలు జరగనుండగా 30వ తేదీన కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాల ఉమ్మడి భేటీలు సాగనున్నాయి.

అలాగే 31న విశాఖతో పాటు పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల సమావేశాలు జరగనున్నాయి.టీడీపీ మహానాడులో సూపర్ సిక్స్ పేరుతో ప్రకటించిన మినీ మ్యానిఫెస్టోకు అదనంగా మరో నాలుగు అంశాలను జనసేన జోడించింది.

ఈ క్రమంలోనే నవంబర్ 1న ఉమ్మడి కార్యాచరణను ప్రకటించనున్న టీడీపీ -జనసేన ఆ రోజు నుంచే ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నాయి.అనంతరం నవంబర్ 3న విజయవాడలో రెండు పార్టీల రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube