బచ్చలికూర ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఇలా తీసుకుంటే చాలా డేంజర్!

ఆకుకూరల్లో ఎన్నో రకాలు ఉన్నాయి.అందులో బచ్చలి కూర( Malabar Spinach ) కూడా ఒకటి.

 Side Effects Of Malabar Spinach! ,malabar Spinach, Bachali Kura, Malabar Spinach-TeluguStop.com

ధర తక్కువే అయినా బచ్చలి కూరలో పోషకాలు మాత్రం లెక్కకు మిక్కిలిగా ఉంటాయి.ఆహారంలో బచ్చలి కూరను చేర్చుకోవడం వల్ల అంతులేని ఆరోగ్య లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతుంటారు.

అది అక్షరాల సత్యం.బచ్చలి కూరలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.

అందువ‌ల్ల‌ రక్తహీనతను తరిమి కొట్టడానికి ఈ ఆకుకూర అద్భుతంగా తోడ్పడుతుంది.అలాగే బరువు తగ్గాలనుకునే వారికి బచ్చలి కూర సహాయపడుతుంది.

బచ్చలి కూరతో కషాయం తయారు చేసుకుని తీసుకుంటే వేగంగా వెయిట్ లాస్ అవుతారు.

Telugu Bachali Kura, Tips, Latest, Malabar Spinach, Malabarspinach-Telugu Health

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్( Urinary Tract Infection ) ఏమైనా ఉంటే దూరం అవుతాయి.బచ్చలి కూరలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.మెదడు పని తీరును పెంచుతాయి.

బ‌చ్చ‌లికూర నార‌ల బ‌ల‌హీన‌త‌ను నివారిస్తుంది.బచ్చలి కూరలో ఫోలేట్ కూడా ఉంటుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు బచ్చలి కూరను తీసుకుంటే పుట్ట‌బోయే బిడ్డ ఎలాంటి లోపాలు లేకుండా ఆరోగ్యంగా పుడుతుంది.
అయితే మంచిది కదా అని బచ్చలి కూరను అతిగా తీసుకుంటే మాత్రం చాలా డేంజర్ అని చెబుతున్నారు నిపుణులు.

బచ్చలి కూరలో ఫైబర్ కంటెంట్( Fiber Content ) అధిక మొత్తంలో ఉంటుంది.కాబ‌ట్టి ఈ ఆకుకూరను అతిగా తీసుకుంటే గ్యాస్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

కొంత మందిలో అలర్జీలకు కూడా కారణం అవుతుంది.

Telugu Bachali Kura, Tips, Latest, Malabar Spinach, Malabarspinach-Telugu Health

బచ్చలి కూరను రోజూ తింటే మూత్ర‌పిండాల్లో రాళ్లు( Kidney Stones ) ఏర్ప‌డ‌తాయి.అంతేకాదు రుచిగా ఉందని బచ్చలి కూరను ఓవర్ గా తీసుకుంటే శరీరం ఇతర పోషకాలను గ్రహించే శక్తిని కోల్పోతుంది.దాంతో లేనిపోని స‌మ‌స్య‌లు త‌లెత్తాయి.

కాబట్టి ఆరోగ్యానికి మేలు చేసేది ఏదైనాస‌రే అతిగా తీసుకుంటే విషమే అవుతుంది.ఇందుకు బచ్చలి కూర కూడా మినహాయింపు కాదు.

కాబట్టి వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే బచ్చలి కూరను తీసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube