టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు( Chandrababu arrest ) వ్యవహారం తర్వాత టిడిపి ఆయన అరెస్టును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.చంద్రబాబు అరెస్టు పై ప్రజల్లో సెంటిమెంటు పెంచేందుకు , వైసిపి ప్రభుత్వం ఏ విధంగా వేధింపులకు పాల్పడుతుంది అనే విషయాన్ని ప్రజలకు వివరించేందుకు టిడిపి అనేక కార్యక్రమాలను చేపడుతుంది.
ఇక చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత ఆ మనోవేదన తో ఏపీలో అనేకమంది మరణించారు. వారి కుటుంబాలను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి( Nara Bhuvaneshwari ) పరామర్శించనున్నారు.
ఈ మేరకు నిజం గెలవాలి పేరుతో ఆమె యాత్రకు నేటి నుంచి శ్రీకారం చుడుతున్నారు.చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక వేదనతో మరణించిన వారి కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు.

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు , ఆయా వర్గాలకు భువనేశ్వరి కృతజ్ఞతలు తెలుపనున్నారు.రాయలసీమ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు రోజులపాటు నిజం గెలవాలి యాత్ర కొనసాగనుంది.ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో నుంచి ప్రారంభమై నిజం గెలవాలి యాత్రకు టిడిపి భారీగానే ఏర్పాట్లు చేపట్టింది.
భువనేశ్వరి యాత్ర ( Bhuvaneshwari yathra) ద్వారా పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లాలా చేయడంతో పాటు, వారంలో మూడు రోజుల పాటు చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై ఆందోళన చెంది మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేలా షెడ్యూల్ రూపొందించారు.

దీంతో పాటు ఆయా చోట్ల నిర్వహించే సభలు, సమావేశాల్లో భువనేశ్వరి ( Nara Bhuvaneshwari )పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.నేడు పాకాల మండలం నేట్ర గుంట గ్రామంలో చంద్రబాబు అరెస్ట్ ను తట్టుకోలేక మృతి చెందిన చిన్నబ్బ, చంద్రగిరి కి చెందిన ప్రవీణ్ రెడ్డి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారు.ఆ తర్వాత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆగరాలలో ‘ నిజం గెలవాలి ‘ కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొంటారు.
ఈ కార్యక్రమానికి భారీగా టిడిపి శ్రేణులు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు .అలాగే రేపు తిరుపతి నియోజకవర్గం , ఎల్లుండి శ్రీకాళహస్తి నియోజకవర్గల్లో జరిగే నిజం గెలవాలి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొనే విధంగా షెడ్యూల్ రూపొందించారు.







