రోడ్డుపై వెళ్తుంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.ఊహించని యాక్సిడెంట్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా తరచుగా ఎంతో మంది చనిపోతుంటారు.
రోడ్డుపై వెళ్లే వారికి సాధారణంగా ఇతర వాహనదారుల నుంచి లేదా భూభాగం పై ఉన్న అడ్డంకుల వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి.అయితే ఒక ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న వారికి మాత్రం ఆకాశం పైనుంచి మృత్యుగండం తలెత్తింది.
తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను @cctvidiots అనే ప్రముఖ వైరల్ వీడియో షేరింగ్ పేజీ పంచుకుంది.అక్టోబర్ 24న షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే ఐదు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.వైరల్ వీడియో ఓపెన్ చేస్తే ఒక రహదారిపై ఎస్‌యూవీ ( suv )వెళ్లడం గమనించవచ్చు.
దానికి సరిగ్గా ఎదురుగా వస్తూ ఒక హెలికాప్టర్( Helicopter ) ఢీకొట్టడం గమనించవచ్చు.ఆ దెబ్బతో ఎస్‌యూవీ బాగా ధ్వంసం అయింది.హెలికాప్టర్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది దాన్నుంచి పెద్ద ఎత్తున మంటలు కూడా ఎగిసిపడ్డాయి.ఆ రోడ్డు అంతా కూడా మంటలు వ్యాపించాయి.
ఈ దృశ్యం చాలా భయానకంగా కనిపించింది.

ఫ్లోరిడాలో( Florida ) ఈ చిన్న విమానం కూలి పోయినట్లు సమాచారం, ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.మృతుల్లో ఇద్దరు పైలట్లు, 4 ఏళ్ల బాలుడు ఉన్నారు.విమానం టేకాఫ్ కాకముందే విమానం ఇంజన్‌లో సమస్య తలెత్తడంతో మంటలు చెలరేగాయి.
క్రాష్‌కి కారణం పూర్తిస్థాయిలో తెలియ రాలేదు.ఈ షాకింగ్ విజువల్స్ ప్రస్తుతం నేటిజన్లను విస్తుగొల్పుతున్నాయి.
దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.







