హైదరాబాద్ లోని బోరబండ ఇన్స్పెక్టర్పై వేటు పడింది.బోరబండ పోలీస్ స్టేషన్ ను సీపీ సందీప్ శాండిల్య ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ క్రమంలో బోరబండ ఇన్స్పెక్టర్ రవికుమార్ పై సీపీ సస్పెన్షన్ వేటు వేశారు.అయితే రవి కుమార్ విధుల్లో నిర్లక్ష్యంతో పాటు పోలీస్ స్టేషన్ నిర్వహణలో లోపాలున్నట్లు గుర్తించారని తెలుస్తోంది.
ఈ క్రమంలో విధుల నుంచి తప్పించిన సీపీ సందీప్ శాండిల్య ఇన్ స్పెక్టర్ ని సీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.కాగా ఓ రాజకీయ నేత కనుసన్నల్లో పని చేస్తున్నారని రవికుమార్ పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీపీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.







