తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ రెండో విడత బలగాలను కేటాయించింది.ఈ మేరకు వంద కంపెనీల నుండి ఇరవై వేల మందితో భద్రతను కేటాయించింది.
ఒక్కో టీమ్ లో 60 నుంచి 80 మంది సిబ్బంది నియామకం అయ్యారు.ఇప్పటికే తెలంగాణకు అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఇండో బార్డర్ పోలీస్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ చేరుకున్నారు.
మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలపై దృష్టి పెట్టిన కేంద్ర బలగాలు ఆ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై గట్టి నిఘా ఏర్పాటు చేశాయి.
ఈ క్రమంలో ఇప్పటికే కేంద్ర బలగాల అధికారులతో రాచకొండ, హైదరాబాద్ సీపీలు సమావేశం అయ్యారు.బందోబస్తు కల్పించడంతో పాటు డబ్బు, మద్యం అక్రమ రవాణాపై నిఘా పెంచారు.
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ తో పాటు మహబూబ్ నగర్ పై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.