మార్కెట్లో మిరపకు మంచి డిమాండ్ ఉండడంతో ఎన్నో నర్సరీలు మిరపనారును పెంచి రైతులకు కొనుగోలు చేస్తున్నాయి.అయితే నకిలీ మిరప విత్తనాలు, నకిలీ మిరప నారు కొనుగోలు చేసిన రైతు పొలంలో ఎంత కష్టపడినా తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సిందే.
కాబట్టి మిరప సాగు చేసే రైతు నారు ఎంపిక విషయంలో కొన్ని మెళుకువలు తెలుసుకొని కొనుగోలు చేసి సాగు చేయాలి.మిరప సాగు( Chilli Cultivation ) చేసే రైతులు మార్కెట్లో మేలు రకం తెగులు నిరోధక రకాలను ఎంపిక చేసుకుని పొలంలో నారును పెంచుకొని ప్రధాన పొలంలో సాగు చేయవచ్చు.
లేదంటే నర్సరీల నుంచి నారును కొనుగోలు చేసి ప్రధాన పొలంలో సాగు చేయవచ్చు.

నర్సరీలలో నారు కొనే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు
: నర్సరీలో( Nursery ) నారు ఏ విధంగా పెరిగిందో మొత్తం గమనించాలి.ముందుగా ఆ నారు ఏ రకం విత్తనాలకు చెందిందో తెలుసుకుని, ఆ విత్తనాలు సర్టిఫైడ్ కంపెనీకి చెందిన ఓ కావో తెలుసుకోవాలి.ఆ రకం నారు వివిధ రకాల తెగుళ్లను తట్టుకొని నిలబడుతుందా లేదా తెలుసుకోవాలి.

ఎటువంటి తెగుళ్లు సోకని నారును ఎంపిక చేసుకోవాలి.నారు వయస్సు కనీసం 45 రోజులు ఉండాలి.మిరప నారు తో పాటు బంతి నారును కూడా రైతులు కొనుగోలు చేసి పొలంలో అక్కడక్కడ నాటుకోవాలి.నారు నర్సరీలో ఎలాంటి వాతావరణంలో పెరిగింది అనేది కూడా గమనించడం ముఖ్యమే.
నారు కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాలను మొత్తం గమనించి అన్ని సవ్యంగానే ఉన్నాయని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే నర్సరీలలో నారును కొనుగోలు చేయాలి.అలా కాకుండా మిరప విత్తనాలను కొనుగోలు చేసి పొలంలోనే నారును తయారు చేసుకోవచ్చు.
ఎటువంటి చీడపీడలు లేదా తెగుళ్లు ఆశించని ఆరోగ్యకరమైన నారును ప్రధాన పొలంలో నాటుకుంటే కాస్త పెట్టుబడి భారం తగ్గడంతో పాటు అధిక దిగుబడి సాధించడానికి వీలు ఉంటుంది.







