దర్శకుడు అంటే సినిమాకు ఉన్న అన్ని క్రాఫ్ట్స్ లో పట్టు ఉండాల్సిన వ్యక్తి.నటులతో సరైన రాబట్టుకోవడం అతని ముఖ్యమైన పని.
మరి అంత బాధ్యతను సక్రమంగా నెరవేర్చే దర్శకుడు తను ఎంతో అలవోకగా నటించగలడు.అందుకే ఈ మధ్య కాలంలో దర్శకులు చాలా మంది నటనలో రాటుదేలుతున్నారు.
పార్ట్ టైం గా చాలా మంది దర్శకులు నటిస్తున్నారు.కానీ సీరియస్ గా నటన ప్రొఫెషన్ గా మార్చుకొని అటు నటన ఇటు దర్శకత్వం చేస్తున్న వారు కూడా ఉన్నారు.మరి నటన, దర్శకత్వం రెండు పడవల ప్రయాణం చేస్తున్న ఆ స్టార్స్ ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
సముద్ర ఖని
తమిళ్ లో నటుడిగా మరియు దర్శకుడిగా ఫుల్ బిజీ గా ఉన్నారు సముద్ర ఖని.( Samudrakhani ) మొన్నటికి మొన్న బ్రో సినిమా కి( Bro Movie ) దర్శకత్వం వహించిన సముద్ర ఖని విమానం సినిమాతో( Vimanam Movie ) లీడ్ యాక్టర్ గా నటించి హిట్టు కొట్టాడు.ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ దర్శకత్వంలో సముద్రఖని హీరోగా ఒక సినిమా ప్రారంభం అయ్యింది.

గౌతమ్ మీనన్
ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు లో అందరి మనసులను దోచుకున్నాడు గౌతమ్ మీనన్.( Gautam Menon ) ఈ మధ్య వరస పెట్టి సినిమాల్లో నటిస్తున్నాడు.

ఎస్ జే సూర్య
ఖుషి వంటి సక్సెస్ ఫుల్ సినిమాకు దర్శకత్వం వహించిన సూర్య( SJ Surya ) ఈ మధ్య అనేక సినిమాల్లో మాస్ విలన్ గా నటిస్తూ బిజీ నటుడు అయ్యాడు.తమిళ్ లో సినిమాకు పది కోట్లు డిమాండ్ చేసే స్థాయిలో ఉన్నాడు సూర్య.
వీళ్ళు మత్రమే కాదు కమెడియన్ వేణు బలగం సినిమాతో దర్శకత్వ బాధ్యతలు మొదలు పెట్టగా ప్రస్తుతం వెంకటేష్ తో ఒక సినిమా తీస్తున్నాడు.C/o కంచర పాలెం దర్శకుడు వెంకటేష్ మహా సైతం అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తూ ఉన్నాడు.
పెద్ద కాపు సినిమాతో శ్రీకాంత్ అడ్డాల సైతం నటనలో శెభాష్ అనిపించుకున్నాడు.







