బండి సంజయ్ బాధేంటి ? రాజకీయాల నుంచి తప్పుకుంటారా ? 

తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు , కరీంనగర్ ఎంపీ బండి బండి సంజయ్( Bandi Sanjay కు పెద్ద కష్టమే వచ్చింది .పార్టీలో ఆయనకు గత కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి.

 What S Wrong With Bandi Sanjay Will Leave Politics , Telangana, Congress, Bj-TeluguStop.com

పార్టీలో ) కొంతమంది కావాలని తనను టార్గెట్ చేసుకొని తన ప్రభావం పెరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారని బండి సంజయ్ అనుమానిస్తున్నారు.ప్రస్తుతం తెలంగాణ బిజెపిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు సంజయ్ కు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి.

ఈ పరిస్థితుల  నేపథ్యం లో ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఆలోచనకు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది.దీనికి కారణం తెలంగాణ బిజెపిలో తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం, తనను అవమానించే విధంగా పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు వ్యవహరిస్తుండడం వంటివి సంజయ్ కు బాధ కలిగిస్తున్నాయట .రాష్ట్ర నాయకుడిగా ఉన్న తనకు స్టార్ క్యాంపైనర్ హోదా ఇవ్వకుండా అవమానించారని, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి,  ఓబిసి మోర్చ అధ్యక్షుడు లక్ష్మణ్ కు స్టార్ క్యాంపెనర్ హోదా ఇచ్చి , అసెంబ్లీ బరి నుంచి మినహాయింపు ఇచ్చారని , తనకు మాత్రం ఆ విధంగా చేయలేదని బండి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట .కరీంనగర్ ఎంపీగా ఉన్న తాను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని,  అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని పార్టీ అధిష్టానాన్ని కోరినా,  కిషన్ రెడ్డి లక్ష్మణ్( Kishan Reddy ) కు మాత్రమే ఆ అవకాశం ఇచ్చి తనను పట్టించుకోలేదని , అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించి , వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని పార్టీలోని కొంతమంది కీలక నేతలు పావులు కదుపుతున్నారని బండి సంజయ్ అనుమానిస్తున్నారు.ఈ పరిస్థితుల్లో రాజకీయాలకు దూరమై ఆర్ఎస్ఎస్ ప్రచారక్ కొనసాగడమే మంచిదనే ఆలోచనలు బండి ఉన్నారట.  తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపం చేసి పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా చేశానని , అయినా తనను అకస్మాత్తుగా తప్పించారని,  ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాలో తన అనుచరులకు టికెట్ ఇవ్వకుండా,  తన ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు .

Telugu Bandi Sanjay, Congress, Etela Rajendar, Kishan Reddy, Telangana, Telangan

 కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని వేములవాడ , హుస్నాబాద్ తో పాటు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మంథాని అసెంబ్లీ టికెట్ కోసం కొంతమంది పేర్లను సిఫార్సు చేసినా, ఆ నియోజకవర్గాల్లో తన అనుచరులకు టిక్కెట్లు ఇచ్చేందుకు ఎటువంటి అభ్యంతరాలు అడ్డంకులు లేకపోయినా , తొలి జాబితాలో వారి పేర్లు ప్రకటించకుండా,  తన ప్రాధాన్యం తగ్గించేలా వ్యవహరించారని సంజయ్ అసంతృప్తితో ఉన్నారట.

Telugu Bandi Sanjay, Congress, Etela Rajendar, Kishan Reddy, Telangana, Telangan

అలాగే పార్టీలో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్( Etela Rajender ) ప్రభావం ఎక్కువైందని,  పార్టీ పై ఆధిపత్యం చెలాయించేలా ఈటెల రాజేందర్ వ్యవహరిస్తున్నారని , తనకు చెక్ పెట్టేలా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారని సంజయ్ అనుమానిస్తున్నారు .పార్టీలో ఉద్దేశపూర్వకంగానే తన ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని సంజయ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube