సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) అంటే ఇప్పుడు పాన్ ఇండియన్ వ్యాప్తంగా ఫేమస్ అనే చెప్పాలి.ఈయన ఒకప్పుడు కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే సుపరిచితం.
కానీ ఇప్పుడు అలా కాదు.కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా తీసిన తర్వాత ఈయన క్రేజ్ అమాంతం పెరిగింది.
ఇక తాజాగా ఈయన దసరా బరిలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) తో లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘లియో‘ ( LEO ).ఈ సినిమా దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.టాక్ ఎలా ఉన్న కలెక్షన్స్ మాత్రం కుమ్మేస్తున్నాయి.
ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్స్ట్ సినిమాను లోకేష్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) ఒక సినిమా చేయనున్నాడు.ఇప్పటికే అఫిషియల్ అప్డేట్ సైతం వచ్చింది.‘తలైవర్ 171‘ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి తాజాగా ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో విలన్ ను ఫిక్స్ చేసారని టాక్.ఆయన ఎవరో కాదు.పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సినిమా సలార్ లో విలన్ రోల్ పోషించిన మాలీవుడ్ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్ అని తెలుస్తుంది.మరి ప్రభాస్ కు విలన్ గా నటించిన పృథ్వీ ఇప్పుడు రజినీకాంత్ సినిమాలో కూడా విలన్ గా నటిస్తాడా లేదా అనేది ముందు ముందు తెలియాల్సి ఉంది.
కాగా ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్( Anirudh Ravichander ) మ్యూజిక్ అందిస్తుండగా సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు.అలాగే ఈ సినిమాకు యాక్షన్ డైరెక్టర్లు గా అన్బు అరివ్ వ్యవహరించనున్నారని ఇప్పటికే తెలిపారు.
అలాగే 2024 మార్చి లేదా ఏప్రిల్ నుండి షూట్ స్టార్ట్ కానుండగా ఈసారి ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.