రాజమండ్రిలో నిర్వహించిన టీడీపీ – జనసేన తొలి సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది.కామన్ మినిమమ్ ప్రొగ్రాం సహా ఆరు అంశాలపై నేతలు ప్రధానంగా చర్చించారని తెలుస్తోంది.
ఈ సమావేశానికి టీడీపీ నేత నారా లోకేశ్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన కమిటీ సభ్యులు హాజరయ్యారు.ఇందులో ప్రధానంగా ఉమ్మడి మ్యానిఫెస్టో రూపకల్పనపై నేతలు చర్చించారు.
అదేవిధంగా ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలన, ఓట్ల జాబితాలో అవకతవకలు, బూత్, జిల్లా స్థాయిల్లో జేఏసీ కమిటీల ఏర్పాటుతో పాటు సమన్వయంపై ఇరు పార్టీల నాయకులు చర్చించారు.







