కంటెంట్ క్రియేటర్లకు కోసం ఇన్ స్టాగ్రామ్ లో అదిరిపోయే ఫీచర్..!

సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ల ద్వారా చాలామంది తమలోని టాలెంట్ ను చూపిస్తూ ఫేమస్ అవుతున్నారు.అంతేకాకుండా సోషల్ మీడియా యాప్స్ ద్వారా సంపాదన కూడా బాగానే ఉంటుంది.

 An Awesome Feature On Instagram For Content Creators , Content Creators, Instag-TeluguStop.com

ప్రతిరోజు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్( YouTube, Facebook, Instagram ) లాంటి యాప్స్ లలో వేలకు పైగా రీల్స్, వీడియోలు అప్లోడ్ అవుతూనే ఉంటాయి.గతంలో టిక్ టాక్ ను ఒక రేంజ్ లో ఉపయోగించుకున్న వారు టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులకు కనెక్ట్ అవుతున్నారు.

ఇన్ స్టా గ్రామ్ లో ఫాలోవర్స్ పెంచుకుంటున్నారు.ఒక్క మాటలో చెప్పాలంటే టిక్ టాక్ బ్యాన్ తర్వాత ఇన్ స్టా గ్రామ్ యూజర్లను ఆకట్టుకోవడం కోసం కంటెంట్ క్రియేటర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

Telugu Creators, Feed, Reels, Youtube-Technology Telugu

ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్న ఇన్ స్టాగ్రామ్ యూజర్లను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు యాప్ లో సరికొత్త అప్డేట్స్ చేస్తూనే ఉంది.తాజాగా ఇన్ స్టాగ్రామ్ వినియోగదారులు వారి పోస్ట్ ల వ్యాఖ్యల విభాగంలో పోల్స్ ను రూపొందించడానికి అనుమతించే ఓ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది.ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది.త్వరలోనే ఇన్ స్టాగ్రామ్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.ఈ సరికొత్త ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే.కంటెంట్ క్రియేటర్లు తమ ఫాలోవర్స్ తో ఎంగేజ్ అవడానికి ఇదొక అదనపు మార్గం.

సాధారణ ఫీడ్ పోస్ట్లు, రీల్స్ ( Feed posts, reels )రెండింటిలో వ్యాఖ్యాలకు పోల్స్ ను జోడించవచ్చు.వ్యాఖ్యాల విభాగంలోని పోల్ లు స్టోరీస్ లోని పోల్స్ ను పోలి ఉంటాయి.

అవి స్టిక్కర్లు గా చాలా సంవత్సరాలుగా అందుబాటులో ఉంటాయి.తద్వారా కంటెంట్ క్రియేటర్లు నిర్దిష్ట పోల్ లో ఓటు వేసిన వ్యక్తుల సంఖ్యను చూడగలరు.

ఈ పొల్ లు పోస్ట్ చేసిన తర్వాత ఎంతకాలం తెరిచి ఉంటాయి.వినియోగదారులు ఓట్లను స్వీకరించడానికి వేర్వేరు సమయ ఫ్రేమ్ లను ఎంచుకునే అవకాశం ఉందా అనే వివరాలు ఇంకా ఇన్ స్టాగ్రామ్ ప్రకటించలేదు.

ఇన్ స్టాగ్రామ్ కు అందించిన ఈ వివరాలను స్వయంగా సంస్థ హెడ్ ఆడమ్ మోస్సేరి ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube