బీజేపీకి నటి గౌతమి రాజీనామా..!

బీజేపీకి నటి గౌతమి తాడిమళ్ల రాజీనామా చేశారు.ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించిన ఆమె రాజీనామా లేఖను కూడా షేర్ చేశారు.

 Actress Gautami Resigns From Bjp..!-TeluguStop.com

తనను మోసం చేసిన వ్యక్తికి బీజేపీ నేతలు సహకరిస్తున్నారన్న గౌతమి ఆ కారణంగానే పార్టీని వీడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.తన ఆస్తులు, నగదు విషయంలో తనను మోసం చేసిన వ్యక్తికి సహకరించడం ఎంత వరకు సమంజసం అని ఆమె ప్రశ్నించారు.

గత 25 ఏళ్లుగా బీజేపీ కోసం ఎంతో కష్టపడ్డానని తెలిపారు.చాలా బాధతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ క్రమంలోనే తన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు తమిళనాడు పార్టీ యూనిట్ చీఫ్ కే అన్నామలైకు పంపారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube