బీజేపీకి నటి గౌతమి రాజీనామా..!

బీజేపీకి నటి గౌతమి తాడిమళ్ల రాజీనామా చేశారు.ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించిన ఆమె రాజీనామా లేఖను కూడా షేర్ చేశారు.

తనను మోసం చేసిన వ్యక్తికి బీజేపీ నేతలు సహకరిస్తున్నారన్న గౌతమి ఆ కారణంగానే పార్టీని వీడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

తన ఆస్తులు, నగదు విషయంలో తనను మోసం చేసిన వ్యక్తికి సహకరించడం ఎంత వరకు సమంజసం అని ఆమె ప్రశ్నించారు.

గత 25 ఏళ్లుగా బీజేపీ కోసం ఎంతో కష్టపడ్డానని తెలిపారు.చాలా బాధతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ క్రమంలోనే తన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు తమిళనాడు పార్టీ యూనిట్ చీఫ్ కే అన్నామలైకు పంపారని తెలుస్తోంది.

డార్క్ నెక్ వారంలో వైట్ గా బ్రైట్ గా మారాలంటే ఈ రెమెడీని తప్పక ట్రై చేయండి!