రాజమండ్రిలో ఇవాళ టీడీపీ – జనసేన తొలి సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది.ఈ భేటీకి టీడీపీ నేత నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.
మంజీరా ఇంటర్నేషనల్ హోటల్ లో మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో లోకేశ్, పవన్ తో పాటు జాయింట్ కమిటీ సభ్యులు పాల్గొననున్నారు.రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై కమిటీ చర్చించనుంది.
ఇప్పటికే ఇరు పార్టీలు సమన్వయ కమిటీ సభ్యులను ప్రకటించిన సంగతి తెలిసిందే.కాగా టీడీపీ కమిటీలో సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, యనమల, పయ్యావుల, తుంగిరాల సౌమ్య, పితాని సభ్యులుగా ఉండగా జనసేన కమిటీలోనాదెండ్ల, కందుల మహేశ్, యశస్వి, నాయకర్, గోవింద రావు, మహేందర్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు.
ఈ సమావేశంలో నేతలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.







