భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వలసదారులకు నిలయంగా ఉంది, 32 లక్షల మంది భారతీయలు విదేశాలలో నివసిస్తున్నారు.వీరిలో ప్రవాస భారతీయులు (NRIs), ఇండియా ఓవర్సీస్ సిటిజన్స్ ( OCIs ) ఉన్నారు.
వారిలో ఎక్కువ మంది భారతదేశంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెడతారు, అయితే 9% మాత్రమే డైరెక్ట్ ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్లలో కూడా పెట్టుబడి పెడుతుంటారు. యూఎస్, సింగపూర్, యూఏఈ, యూకేల్లో నివసిస్తున్న ఎన్నారైలు భారతదేశంలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు.
ఇండియాకు మొత్తం ఇన్‌ఫ్లోలలో 54% వాటా ఈ దేశాల నుంచే కలిగి ఉంది.హై-పెయింగ్ జాబ్స్( High-paying jobs ) కోసం ఎక్కువ మంది భారతీయులు అధిక ఆదాయ దేశాలకు తరలివెళ్లినందున, పేమెంట్ విధానాలు కాలక్రమేణా మారాయి.
ఈ దేశాలలో యూఎస్, యూకే, తూర్పు ఆసియా (సింగపూర్, జపాన్), ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉన్నాయి.ఇంతకుముందు, చాలా మంది భారతీయులు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలలో తక్కువ నైపుణ్యం, అనధికారిక రంగాలలో పనిచేశారు.

ఎన్నారైలు భారతదేశంలోని షేర్లు, డిబెంచర్లు, మ్యూచువల్ ఫండ్‌లు, ETFs, ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, బాండ్‌లు వంటి వివిధ ఆర్థిక సాధనాలలో పెట్టుబడి పెట్టవచ్చు.ఇవి చాలా ఉత్తమంగా నిలుస్తాయి.వీటి గురించి ఎన్నారైలకు తెలుసో లేదో కానీ వీటిలో ఎక్కువగా రిటర్న్స్ పొందవచ్చు.ఈ పెట్టుబడుల కోసం వారు నాన్ రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ ( NRE ), నాన్ రెసిడెంట్ ఆర్డినరీ ( NRO ) వంటి రెండు రకాల బ్యాంక్ ఖాతాలను ఉపయోగించవచ్చు.
NRE ఖాతా వారి ఆదాయాలను వారు నివసిస్తున్న దేశానికి తిరిగి పంపించడానికి అనుమతిస్తుంది, అయితే NRO అకౌంట్ ద్వారా స్వదేశానికి సంవత్సరానికి 10 లక్షల డాలర్లను పంపించుకునేలా ఒక పరిమితి ఉంటుంది.ఈ పరిమితి కాకుండా, ఎన్నారైలు భారతదేశంలో సంపాదించిన వడ్డీ ఆదాయం, డివిడెండ్ ఇన్‌కమ్, ప్రస్తుత వ్యాపార ఆదాయాన్ని స్వదేశానికి పంపించడానికి కూడా ఆర్‌బీఐ అనుమతిస్తుంది.

ఎన్నారైలు భారతదేశంలో తమ పెట్టుబడులను మూడు విధాలుగా నిర్వహించవచ్చు.NRE లేదా NRO ఖాతాలను నిర్వహించడానికి మాండేట్ హోల్డర్‌ను నియమించడం ఇందులో ఒక మార్గం.వారి తరపున పెట్టుబడులు పెట్టడానికి మరొకరికి అధికారం కూడా ఇవ్వవచ్చు.ఎన్నారైలు భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలలో ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టులలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు, అయినప్పటికీ, వారు క్యాష్ సెగ్మెంట్‌లో ఇంట్రా-డే ట్రేడింగ్ లేదా షార్ట్ సెల్లింగ్ చేయలేరు.
వారు తమ ట్రేడ్‌లను డెలివరీ ద్వారా పరిష్కరించుకోవాలి.కరెన్సీ డెరివేటివ్‌లలో వ్యాపారం చేయడానికి కూడా వారికి అనుమతి లేదు.







