రవితేజ( Ravi Teja ) వంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) మూవీ పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై సినిమా ఫ్లాప్ గా నిలిచింది.నిడివి 30 నిమిషాలు తగ్గించినా ఈ సినిమా రిజల్ట్ విషయంలో ప్రేక్షకుల అభిప్రాయం మారలేదు.
రవితేజ సీరియస్ సినిమాలలో, నెగిటివ్ షేడ్స్ పాత్రలు ఉన్న సినిమాలలో నటిస్తే జనాలు చూడరని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ కావడం గమనార్హం.రవితేజ గత సినిమా రావణాసుర కూడా బాక్సాఫీస్( box office ) వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
సీరియస్ గా సాగే మూవీ కావడంతో పాటు రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించడం ఈ సినిమాకు మైనస్ అయింది.రవితేజ గతంలో షాక్, నేనింతే లాంటి సీరియస్ సినిమాలతో ఇదే తరహా ఫలితాలను అందుకున్నారు.
రవితేజ మార్క్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా అవుతుండగా ఆ మార్క్ ఎంటర్టైన్మెంట్ మిస్సైన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

వెంకీ, దుబాయ్ శీను, కృష్ణ, కిక్, మిరపకాయ్, ధమాకా సినిమాలలోని రవితేజ రోల్స్ ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటాయి.మాస్ మహారాజ్ రవితేజ అలాంటి పాత్రలనే ఎంచుకోవాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రాబోయే రోజుల్లో అయినా రవితేజ కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేసి విమర్శలకు చెక్ పెడతారేమో చూడాలి.
రవితేజను నెగిటివ్ గా చూడలేరని ఫ్యాన్స్ చెబుతున్నారు.రవితేజను అభిమానించే ఫ్యాన్స్ పెరుగుతుండగా కథల ఎంపికలో మాస్ మహారాజ్ జాగ్రత్త పడాల్సి ఉంది.అభిషేక్ అగర్వాల్( Abhishek Agarwal ) ఆర్ట్స్ బ్యానర్ కు ఈ సినిమా భారీ షాకిచ్చింది.రవితేజ త్వరలో నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని సమాచారం.
రాబోయే రోజుల్లో రవితేజకు ఎలాంటి విజయాలు దక్కుతాయో చూడాల్సి ఉంది.