ఈ రోజుల్లో దొంగలు రెచ్చిపోతున్నారు.పట్టపగలే అందరూ చూస్తుండగానే వారు తమ చేతులకు పని చెబుతున్నారు.
వీరి వల్ల పబ్లిక్ లో కూడా ఎలాంటి రక్షణ లేకుండా పోతోంది.రోజురోజుకీ వీర ఆగడాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా బెంగళూరులో( Bangalore ) జరిగిన ఒక చోరీ వీడియో చూసి మరింత కంగు తింటున్నారు.బెంగళూరులో జరిగిన ఈ చోరీకి సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బీఎండబ్ల్యూ కారు( BMW Car ) అద్దాలను పగులగొట్టి అందులోని రూ.13.75 లక్షల నగదును అపహరించిన దృశ్యాలు వీడియోలో రికార్డ్ అయ్యాయి.
వివరాల్లోకి వెళితే, ఇటీవల సర్జాపూర్‌లోని సోంపురాలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సమీపంలో స్థలం రిజిస్ట్రేషన్ చేసేందుకు ఒక వ్యక్తి తన బీఎండబ్ల్యూ కారులో అక్కడికి వెళ్లారు.
అనంతరం ఆఫీస్ ముందే కారును పార్క్ చేసి లోపలికి వెళ్లారు.ఇక్కడికి వచ్చేవారు డబ్బుతోనే వస్తారని దొంగలు ( Thieves ) గ్రహించారు.ఎలాగైనా డబ్బు దోచేయాలని బైక్ వేసుకొని ఇద్దరు దొంగలు అక్కడికి వచ్చారు.అప్పుడే వారికి బీఎండబ్ల్యూ కారు కనిపించింది.
అందులో డబ్బు ఉన్నాయో లేదో ఒక దొంగ నిల్చోని చాలా సేపు పరిశీలించాడు.తర్వాత ఒక బ్యాగ్ ఉన్నట్లు గమనించాడు.
చాలా మంది ప్రజలు అక్కడే తిరుగుతూ ఉన్నారు.మళ్లీ అది పట్టపగలు.
అయినా కూడా ఆ దొంగలు కొంచెం కూడా భయపడకుండా అందరూ చూస్తుండగానే పట్టపగలే దొంగతనానికి పాల్పడ్డారు.
కారు యజమాని మోహన్‌బాబు( Mohan Babu ) అనేకల్‌లోని కసబా నివాసి.ముత్తగట్టి గ్రామంలోని భూమిని కొనుగోలు చేసేందుకు స్నేహితుడి వద్ద రూ.5 లక్షలు అప్పుగా తీసుకుని సొంత డబ్బుకు చేర్చాడు.అతను, అతని బంధువు రమేష్ ( Ramesh ) శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కార్యాలయానికి సమీపంలోని గిరియాస్ ఔట్‌లెట్ సమీపంలో కారును వదిలి వెళ్లారు.మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తిరిగి వచ్చి చూసే సరికి కారు అద్దాలు పగులగొట్టి నగదు పోయినట్లు కనిపించింది.దాంతో వారు షాక్ అయ్యారు.
అనంతరం తేరుకొని సర్జాపుర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని 379, 427 సెక్షన్ల కింద దొంగతనం, దుశ్చర్యలకు పాల్పడినట్లు కేసు నమోదు చేశారు.సీసీ టీవీ చెక్ చేస్తూ విచారణ జరిపి నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
దొంగలు బైక్ పై వచ్చారు ఒక వ్యక్తి ముఖానికి మాస్క్ తోడుకొని ఉండగా మరొక వ్యక్తి దొంగతనం చేశాడు.బైక్ నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని ఉండగా కారు అద్దాలు పగలగొట్టి డబ్బు దోచేసిన వ్యక్తి ఫేస్ కి ఎలాంటి కవరింగ్స్ లేకుండా కనిపించాడు.