సార్‌ పేడ ఎత్తుతుంటే.. వ్లాగ్ చేసిన బుడ్డోడు.. తర్వాతేమైందో తెలిస్తే పొట్ట చెక్కలే..

సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలకు కొదవలేదు.ముఖ్యంగా చిన్నపిల్లలు అమాయకత్వంతో చేసే కొన్ని చేష్టలు మనల్ని ఎంతగానో నవ్విస్తుంటాయి.

 Child Hilarious Vlog With Tuition Teacher Video Viral Details, Viral News, Lates-TeluguStop.com

అలాంటి వీడియోలు ఇంటర్నెట్లో ప్రత్యక్షం కావడం అరదే కానీ అవి బాగా వినోదాన్ని పంచుతాయి.తాజాగా ఆ కోవకు చెందిన ఒక వీడియో ఎక్స్‌ ప్లాట్‌ఫామ్ (గతంలో ట్విట్టర్‌)లో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఒక బుడ్డోడు తన ట్యూషన్ టీచర్( Tution Teacher ) పేడ ఎత్తుతుంటే దానిని వ్లాగ్ చేయాలనుకున్నాడు.

ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలనుంచి పెద్దల వరకు స్మార్ట్‌ఫోన్ పట్టుకొని లేచిన దగ్గర్నుంచి పడుకునేంతవరకు వీడియోలు తీసి వాటిని యూట్యూబ్, తదితర యాప్‌లలో అప్‌లోడ్ చేస్తున్నారు.

తద్వారా ఫేమస్ కావడమే కాక డబ్బు కూడా సంపాదిస్తున్నారు.అయితే ఈ పిల్లోడు( Boy ) చాలా చిన్న వయసులోనే ఆ పని చేద్దామనుకున్నాడు.అతడు ఏకంగా తన ట్యూషన్ సార్‌తోనే ఈ కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు.కానీ టైమింగ్ బాగోలేక పోవడంతో పాపం అతడికి చివాట్లు తప్పలేదు.

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక పిల్లవాడు ట్యూషన్ టీచర్ ఇంటిలో ఉండటం మీరు గమనించవచ్చు.ఆ బాలుడు తన చేతిలో ఒక స్మార్ట్‌ఫోన్ ( Smartphone ) పట్టుకోవడం కూడా మీరు చూడవచ్చు.అంతేకాదు, ఈ బుడ్డి స్టూడెంట్ మొబైల్ ఫోన్‌లో వ్లాగ్( Vlog ) చేస్తూ కనిపించాడు.ఆ వ్లాగ్‌లో “నేను ట్యూషన్ సర్ ఇంటికి వచ్చాను…” అని పిల్లవాడు అని చెప్పడం మీరు వినవచ్చు.

అతడి వెనుకే టీచర్‌ ఆవు పేడ ఎత్తుతూ పని చేసుకుంటున్నాడు.ఆ దృశ్యాలను రికార్డ్ చేయడమే కాకుండా ఈ పిల్లోడు, పెద్ద గొంతుతో, “సార్… మీరు ఆవు పేడను సేకరిస్తున్నారా?” అని తన టీచర్‌ని అడిగాడు.అప్పటికి గానీ సార్ కి ఈ సంగతి తెలియలేదు.

ట్యూషన్ కి వచ్చి చదువుకోకుండా ఫోన్ పట్టుకుని వ్లాగ్ చేస్తున్నాడు అని టీచర్ కి బాగా కోపం వచ్చింది.పైగా తాను పేడ( Dung ) ఎత్తుతుంటే ఏదో పెద్ద పని చేసినట్లు వీడియోలు తీస్తున్నాడని ఇంకా కోప్పడ్డాడు.అందుకే ఆ పిల్లవాడిని తిట్టాడు.“మళ్ళీ వ్లాగ్ చేస్తున్నావా.ఈ పనికిమాలిన పని మానేయమని చెప్పాను కదా” అని కొట్టడానికి వెంటపడ్డాడు.ఈ పిల్లోడు చిచ్చర పిడుగు కావడంతో టీచర్ కు దొరక్కుండా పారిపోయాడు.“నువ్వు ఇక్కడ చదువుకోవడానికి వచ్చావు, వ్లాగ్స్ చేయడానికి కాదు.” అని టీచర్ అతడికి చివాట్లు పెట్టడం చూడవచ్చు.అయినప్పటికీ, ఈ అల్లరి బాలుడు తన వ్లాగ్‌ను అలాగే కంటిన్యూ చేశాడు.

ఈ వీడియో చూసి సోషల్ మీడియాలో చాలామంది నవ్వుకుంటున్నారు.దీనిపై మీరు కూడా లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube