సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు బీజేపీలో అసమ్మతి రాగం వినిపిస్తోంది.పటాన్ చెరు నియోజకవర్గం టికెట్ ను నందీశ్వర్ గౌడ్ కు ఇవ్వడంపై ఎనిమిది మంది మండల, మున్సిపల్ మరియు డివిజన్ అధ్యక్షులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు పార్టీ జాతీయ నాయకత్వం పునరాలోచన చేసి అభ్యర్థిని మార్చాలని నేతలు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.హైకమాండ్ అభ్యర్థిగా ప్రకటించిన నందీశ్వర్ గౌడ్ తరచూ పార్టీలు మారే వ్యక్తి అని అసంతృప్త నేతలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో నందీశ్వర్ గౌడ్ కు టికెట్ ఇవ్వడం సరికాదని వెల్లడించారని సమాచారం.