రేణు దేశాయ్( Renu Desai ) 2000లో ‘బద్రి’ సినిమా( Badri )తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఒకప్పటి నటి.ఆమె షూటింగ్ సమయంలో కథానాయకుడు పవన్ కళ్యాణ్‌ని ప్రేమించి 2009లో పెళ్లి చేసుకుంది.
అప్పట్లో వీరి జంట చాలా చూడముచ్చటగా ఉందని పవన్ అభిమానులు కామెంట్స్ చేశారు.ఆమెనే పవన్ కళ్యాణ్ కు జీవితాంతం తోడు ఉంటుందని అనుకున్నారు.కానీ వారు జస్ట్ మూడేళ్ల తర్వాత 2012లో విడాకులు తీసుకున్నారు.2003లో పవన్ కళ్యాణ్ స్వయంగా దర్శకత్వం వహించిన ‘జాని’( Johnny ) రేణు దేశాయ్ నటించిన చివరి చిత్రం.ఆ సినిమా తర్వాత నటనకు తాత్కాలికంగా స్వస్తి చెప్పి తన వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించింది.

తాజాగా రేణు దేశాయ్ గురించి ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది.టాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ హీరోలలో ఒకరైన మహేష్ బాబును రేణు దేశాయ్ తిరస్కరించిందనే విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.‘బద్రి (2000)’ తర్వాత 2001లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘మురారి’ సినిమా( Murari Movie )లో మహేష్ బాబు సరసన కథానాయికగా నటించే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.అయితే రేణూ మరెవరితోనూ నటించడం ఇష్టం లేక ఆ ఆఫర్‌ను తిరస్కరించింది.అప్పటికే 2000 నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్న ఆమె పవన్ కళ్యాణ్.‘జానీ’ తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు.పవన్ తో రిలేషన్‌షిప్‌లో ఉండడం బట్టే ఏ హీరోతో రొమాన్స్ చేయడం ఇష్టం లేక ఆమె మహేష్ బాబు అంతటి స్టార్ హీరో సినిమా రిజెక్ట్ చేసిందా? అనేది తెలియ రాలేదు.
దాదాపు 20 ఏళ్ల తర్వాత లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటూ మళ్లీ వెండితెరపైకి రేణు దేశాయ్ వచ్చింది.రవితేజ కథానాయకుడిగా నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’( Tiger nageswara rao) చిత్రంలో ఆమె లవణం అనే కీలక పాత్రను పోషించింది.
ఆంద్రప్రదేశ్‌కు చెందిన ఓ కరుడుగట్టిన దొంగ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.దాంతో చాలా రోజుల తర్వాత వెండితెరపై మెరిసినా రేణు దేశాయ్ కి సంతోషం లేకుండా పోయింది.

ఇకపోతే ఈ ముద్దుగుమ్మ 2021లో జీ తెలుగులో ప్రసారమైన రాధమ్మ కూతురు సీరియల్లో పార్వతీదేవిగా గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి తెలుగు బుల్లితెరకు పరిచయమయ్యింది.ఈ అందాల తార మల్టీ టాలెంటెడ్ అని చెప్పుకోవచ్చు.ఇప్పటిదాకా ఈమె డైరెక్టర్‌గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా, ప్రొడ్యూసర్ గా పనిచేసింది.







