భర్త ప్రోత్సాహంతో ఎస్సై.. కూతురిని పెంచుతూ సక్సెస్.. ఈ మహిళ సక్సెస్ కు హ్యట్సాఫ్ అనాల్సిందే!

పెళ్లైన మహిళలు కెరీర్ పరంగా లక్ష్యాలను సాధించడంతో ఎన్నో అవరోధాలు, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి.పెళ్లై పిల్లలు ఉన్న మహిళలు మరిన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

 Telangana Si Suchita Success Story Details Here Goes Viral In Social Media , Vi-TeluguStop.com

అయితే ఒక మహిళ మాత్రం భర్త ప్రోత్సాహంతో ఎస్సైగా లక్ష్యాలను సాధించి కెరీర్ పరంగా సక్సెస్ అయ్యారు.తెలంగాణకు చెందిన సుజిత చదువు పూర్తైన తర్వాత టీచర్ ఉద్యోగం సాధించడం కోసం టెట్ కు ప్రిపేర్ అయ్యారు.

అయితే టెట్ లో ఆశించిన ఫలితం రాకపోవడంతో ఆమె ఎస్సైగా కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు.

హోంగార్డ్ మద్ది వివేకానందరెడ్డి( Vivekananda Reddy ) కూతురు సుజిత తాడ్వాయి( Sujitha Tadvai ) పదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదువుకున్నారు.

ఆ తర్వాత కామారెడ్డిలోని ఆర్యభట్ట కాలేజ్ లో ఇంటర్ పూర్తి చేశారు.ఎస్.జీ.టీ టెట్ లో క్వాలిఫై అయిన సుజిత టీచర్ పరీక్ష రాసినా ఆ పరీక్షలో క్వాలిఫై కాలేదు.కామారెడ్డిలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సుజిత డిగ్రీ పూర్తి చేశారు.పెళ్లి తర్వాత హైదరాబాద్ లో స్థిరపడిన సుజిత ఇక్కడే శిక్షణ తీసుకున్నారు.

సుజితకు నాలుగేళ్ల కూతురు ఉండగా సుజిత ఎంతో కష్టపడి ఎస్సై పరీక్ష రాసి జాబ్ సాధించడంతో పాటు ప్రశంసలు అందుకుంటున్నారు.తన సక్సెస్ తో సుజిత ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.

సుజిత తండ్రి వివేకానందరెడ్డి కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో హోం గార్డ్ గా పని చేస్తున్నారు.సుజిత ఉద్యోగం సాధించడంతో ఆమె కుటుంబ సభ్యుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

Telugu Ambedkar, Aryabhatta, Kama, Si Sujitha, Sujitha Tadvai-Inspirational Stor

టాలెంట్ ఉంటే సక్సెస్ కచ్చితంగా సొంతమవుతుందని సుజిత ప్రూవ్ చేశారు.కెరీర్ పరంగా సుజిత మరిన్ని విజయాలను సొంతం చేసుకుని ఎంతోమంది మహిళలకు స్పూర్తిగా నిలవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.సుజిత భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube