తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఇవాళ విడుదలకానుంది.ఈ మేరకు మధ్యాహ్నం బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఈ క్రమంలో 50 మందికి పైగా అభ్యర్థులతో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం అయిందని తెలుస్తోంది.ఇప్పటికే టికెట్లు దక్కిన వారికి కాల్ చేసిన బీజేపీ నేతలు సమాచారం ఇచ్చారు.
ఈ ఫస్ట్ లిస్టులో బీసీలు, మహిళలకు బీజేపీ ఎక్కువ ప్రాధాన్యత కల్పించింది.కాగా ఈ క్రమంలో కరీంనగర్ నుంచి బండి సంజయ్, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్, బోథ్ నుంచి సోయం, గజ్వేల్ మరియు హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ పోటీకి దూరంగా ఉండనున్నారు.







