వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఇంగ్లాండ్ జట్టు చాలా ఘోరమైన ఓటమిని చవిచూసింది.ముంబై వేదికగా జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు విధ్వంసక బ్యాటింగ్ ఆడి 229 భారీ పరుగుల తేడాతో ఇంగ్లాండ్( England ) జట్టును ఘోరంగా ఓడించారు.
క్రికెట్ మ్యాచ్ అన్నాక గెలుపు, ఓటములు సహజం.ఏదో 10 లేదా 15 పరుగుల తేడాతో ఓడిపోతే పెద్దగా బాధ అనిపించదు కానీ భారీ పరుగుల తేడాతో ఓడిపోతే ఉండే బాధ మాటల్లో వర్ణించడం కష్టం.
ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆటగాళ్ల పరిస్థితి అలాగే ఉంది.

ఇంగ్లాండ్ చేసిన అతి పెద్ద పొరపాటు ఏమిటంటే.టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడమే.400 పరుగుల లక్ష్యాన్ని చేదించడం కోసం బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆటగాళ్లలో కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గిపోయింది.అందుకే ఇంగ్లాండ్ జట్టు బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు.కేవలం 22 ఓవర్లలో 170 పరుగులకే ఇంగ్లాండ్ కుప్పకూలింది.ఒకవేళ ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి ఉంటే.కచ్చితంగా మ్యాచ్లో గెలుస్తుంది అని చెప్పలేం కానీ ఓటమి అయితే ఇంత ఘోరంగా ఉండేది కాదు.

దక్షిణాఫ్రికా బ్యాటర్లైన క్లాసెన్, జాన్సన్ లను కట్టడి చేయడంలో ఇంగ్లాండ్ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు.క్లాసెన్ 67 బంతుల్లో 109 పరుగులు ( Heinrich Klaasen )చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పొందాడు.ఈ టోర్నీలో దక్షిణాఫ్రికాకు ఇది మూడవ విజయం.ఇలాంటి దూకుడు నే ప్రదర్శిస్తే సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్ తో పాటు ఫైనల్ చేరే అవకాశం ఉంది.ఒక్క మ్యాచ్ తో రన్ రేట్ కూడా బాగా పెంచుకుంది దక్షిణాఫ్రికా.నెదర్లాండ్స్( Netherlands ) చేతిలో ఓడిన సౌత్ ఆఫ్రికా ఇలా రెచ్చిపోయి ఘనవిజయం సాధిస్తుంది అని ఎవరు ఊహించలేదు.2019లో టైటిల్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కనీసం సెమీ ఫైనల్ కు చేరుతుందో లేదో అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది.







