నందమూరి నటసింహం బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) ఈ మధ్యకాలంలో తన మార్కెట్ ను బాగా విస్తరించు కున్నాడు.ఈ విషయం గత రెండు మూడు సినిమాలతో రుజువు అయ్యింది.
అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ పడడమే ఇందుకు నిదర్శనం.ఇక ఈ సినిమా విజయం సాధించిన తర్వాత బాలయ్య ఏది చేసిన తిరుగుండడం లేదు.
అఖండ తర్వాత వీరసింహారెడ్డి సినిమాతో సంక్రాంతికి వచ్చి మరో హిట్ అందుకున్నాడు.ఇక ఇప్పుడు దసరా సీజన్ ను కూడా కబ్జా చేసాడు.
బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”భగవంత్ కేసరి” ( Bhagavanth Kesari ) సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా మొన్న అక్టోబర్ 19న గ్రాండ్ గా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.కాగా ఈ సినిమాను గురువారమే రిలీజ్ చేయగా ఈ సినిమాకు అన్ని వర్గాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.మొన్న రిలీజ్ అయిన ఈ సినిమాకు మౌత్ టాక్ బాగా రావడంతో కలెక్షన్స్ రోజురోజుకూ మరింత పుంజుకుంటున్నాయి.

ఇప్పుడు మేకర్స్ మూడు రోజుల కలెక్షన్స్ వివరాలను అఫిషియల్ గా ప్రకటించారు.దీంతో ఈ సినిమా బాక్సాఫీస్( box office ) వద్ద ఫుల్ జోష్ గా ముందుకు వెళుతూ విధ్వంసం సృష్టిస్తుంది.వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లోనే 71 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.ఈ విషయాన్నీ మేకర్స్ సరికొత్త పోస్టర్ తో తెలిపారు.
మరి రానున్న రోజులు వరుస సెలవలు కావడంతో ఈ సినిమా మరింత కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది.కాగా ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా కూతురు రోల్ లో శ్రీలీల, విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు.
ఇక షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా థమన్ సంగీతం అందించారు.







