Naga Chaitanya : నాగ చైతన్య కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధమే…రానా కామెంట్స్ వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దగ్గుబాటి వారసుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రానా ( Rana Daggubati ) ఒకరు.రామానాయుడు మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి రానా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు.

 Rana Daggubati Sensational Comments On Naga Chaitanya-TeluguStop.com

అయితే ఈయన రోటీన్ కథలను కాకుండా ఎంతో విభిన్నమైనటువంటి కథ చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు.తనకు కథ నచ్చితే అది హీరోనా విలన్ పాత్ర అని కూడా చూడరు.

విలన్ పాత్రలో నటించడానికి కూడా రానా ముందు వరుసలో ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.

Telugu Bheemla Nayak, Daggubati, Naga Chaitanya, Ram Charan, Rana Daggubati, Tol

ఇప్పటివరకు రానా విలన్ పాత్ర( Villain Role )లలో నటించి మెప్పించారు.బాహుబలి సినిమాలో విలన్ గా నటించిన రానా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ పొందారు.ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా( Bheemla Nayak )లో కూడా ఈయన విలన్ పాత్రలో నటించారు.

ఈ సినిమా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఇలా కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి రానా ముందు వరుసలో ఉంటారనే చెప్పాలి.

ఇక ఈయన సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అని వెబ్సైట్ లో నటించిన సంగతి మనకు తెలిసిందే.


ఇక రానా కెరియర్ గురించి పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన దగ్గుబాటి కుటుంబంలో మొదటి వారసుడు కావడంతో ప్రతి ఒక్కరు కూడా రానా పట్ల ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉండేవారు.

ఇక సురేష్ బాబు సోదరి కుమారుడే నాగచైతన్య ( Naga Chaitanya ) అనే విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోని నాగచైతన్యతో కూడా రానాకు చాలా మంచి బాండింగ్ ఉంది.ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు నాగచైతన్యతో తనకు ఉన్నటువంటి బాండింగ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

అసలు మీరు నాగచైతన్యతో ఎలా ఉంటారు మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఏంటి అనే ప్రశ్న ఈయనకు ఎదురు కావడంతో రానా పలు విషయాలను వెల్లడించారు.


Telugu Bheemla Nayak, Daggubati, Naga Chaitanya, Ram Charan, Rana Daggubati, Tol

మా ఇంట్లో నా తర్వాత పుట్టినది నాగచైతన్య నాగచైతన్య అంటే అందరూ కూడా చాలా మంచి ప్రేమ చూపించేవారు.ఇక చిన్నప్పటి నుంచి కూడా నేను నాగచైతన్య ఇద్దరు కలిసి పెరిగాము.ప్రతి ఒక్క విషయంలోనూ ఇద్దరు అన్ని విషయాలను షేర్ చేసుకుంటాము.

నాకు ఏదైనా హెల్ప్ అయితే నాగచైతన్య చేస్తాడు.నాగచైతన్యకు ఏదైనా అవసరమైతే ఏం చేయడానికైనా తాను సిద్ధమేనని రానా తెలిపారు.

ఇలా చిన్నప్పటినుంచి తాను వేరు నేను వేరు అని పెరగలేదని ఇద్దరం ఒకేలాగా పెరుగుతూ వచ్చామని రానా వెల్లడించారు.మా ఇంట్లో నా తర్వాత నాగచైతన్య పుట్టడంతో మా ఇద్దరికీ కూడా మంచి బాండింగ్ అనేది ఏర్పడిందని తెలిపారు.

రామ్ చరణ్ అంటే కూడా రానాకి ఎంతో ఇష్టమైన విషయం మనకు తెలిసిందే వీరిద్దరూ కూడా మంచి స్నేహితులు కావడంతో రామ్ చరణ్ (Ram Charan) గురించి కూడా ఈయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి.


Telugu Bheemla Nayak, Daggubati, Naga Chaitanya, Ram Charan, Rana Daggubati, Tol

రామ్ చరణ్ గురించి ప్రశ్నిస్తూ మీకు నాగచైతన్య అంటే ఎక్కువ ఇష్టమా చరణ్ అంటే ఇష్టమా అంటూ ప్రశ్నలు ఎదురు కావడంతో ఎవరిష్టమా అంటే ఏమని సమాధానం చెబుతాం ఎప్పుడూ ఒకరే ఇష్టంగా ఉండరు కదా సందర్భానుసారంగా ఒక్కోసారి ఒక్కొక్కరు ఇష్టంగా ఉంటారు.అయితే మేమంతా కూడా ఓకే ఫ్యామిలీ లాగా( Family ) ఉండే వాళ్ళమని చరణ్ తో కూడా తన బాండింగ్ చాలా మంచిగా ఉంది అంటూ ఈ సందర్భంగా రానా రాంచరణ్ గురించి అలాగే నాగచైతన్య గురించి చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube