యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( Ntr ) ప్రస్తుతం కొరటాల శివ ( Koratala Shiva ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా ( Devara ) షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఈయన కొంత విరామం తీసుకుని ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఇక ఈ సినిమా షూటింగ్ పనులకు ఏమాత్రం విరామం ఇవ్వకుండా వరుస షెడ్యూల్ చిత్రీకరణలో ఎన్టీఆర్ ఎంతో బిజీగా ఉన్నారు.ఇక నిన్నటి వరకు హైదరాబాదులో ప్రత్యేకమైన సెట్ వేసి అక్కడ షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నటువంటి ఎన్టీఆర్ గోవా పయనం అయ్యారని తెలుస్తుంది.
హైదరాబాద్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న వెంటనే ఈయన గోవా వెళ్లడంతో ఎందుకు గోవా వెళ్లారు అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాదులో యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి కావడంతో తమ తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ గోవాలో జరగబోతుంది దీంతో ఎన్టీఆర్ కూడా గోవా వెళ్తున్నారని తెలుస్తుంది.గోవాలో ప్రత్యేకమైన సెట్ వేసి అక్కడ హీరో హీరోయిన్ల మధ్య కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కూడా గోవా వెళ్లారని తెలుస్తుంది.
ఈ షెడ్యూల్ చిత్రీకరణలో నటి జాన్వీ కపూర్( Actress Janhvi Kapoor ) కూడా పాల్గొనబోతున్నారు.ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయాన్ని తాజాగా కొరటాల శివ వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే.

మొదటి భాగం ముందుగా దర్శకనిర్మాతలు అనౌన్స్ చేసినటువంటి తేదీ ప్రకారమే ఏప్రిల్ 5వ తేదీ విడుదల కానుంది.ఈ సినిమా విడుదలైన తర్వాత తదుపరి సీక్వెల్ షూటింగ్ పనులను వెంటనే మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది.ఇక ఎన్టీఆర్ ఈ సినిమాతో పాటు తన తదుపరి చిత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాలతో పాటు ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 సినిమాలో కూడా భాగమవుతున్నారు.
అయితే ప్రస్తుతం ఈ సినిమా కూడా షూటింగ్ పనులను ప్రారంభించుకుంది.మొత్తానికి ఎన్టీఆర్ వరుస సినిమాలతో కెరియర్ పరంగా ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్నారు.







