రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూరు గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద జై భవాని యూత్ & అస్సోషియేషన్ దుర్గాదేవి మండపం వద్ద సర్పంచ్ ముత్యం అమర్ గౌడ్ దుర్గామాత దివ్య ఆశీస్సులతో మండల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని దర్శించుకొని వేడుకున్నారు.తదనంతరం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి వేణు రావు( Chintapalli Venu Rao ) వారితో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పొన్నం శేఖర్, ఫాక్స్ డైరెక్టర్ జంగిటీ కొమురయ్య,కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు, ప్రజలు యువకులు పాల్గొన్నారు.







