న్యాచురల్ స్టార్ నాని( Nani ) మొదటి నుండి ఏడాదికి మూడు సినిమాలు ఉండేలా చూసుకుంటూ వస్తున్నాడు.మరి ఈ సంఖ్య ఈ మధ్య బాగా తగ్గించాడు.
దసరా సినిమా( Dasara Movie ) తర్వాత ఆచి తూచి కథలను ఎంచుకుంటూ తన స్థాయి పడిపోకుండా చూసుకుంటున్నాడు.నాని కెరీర్ లోనే ‘దసరా’ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
అంతేకాదు ఈ సినిమా 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా తర్వాత వెంటనే నాని మరో మూవీ స్టార్ట్ చేసి పూర్తి కూడా చేస్తున్నాడు.
నాని కెరీర్ లోనే బెంచ్ మార్క్ సినిమా 30వ ప్రాజెక్ట్ ను కొత్త డైరెక్టర్ శౌర్యన్ తో చేస్తున్నాడు.ఇది ‘హాయ్ నాన్న’( Hi Nanna Movie ) అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాతో ఈ ఏడాది చివర డిసెంబర్ లో ఆడియెన్స్ ను పలకరించేందుకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి.ఈ సినిమాతో ఈ ఏడాది డిసెంబర్ 7న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇదిలా ఉండగా ఈ సినిమా లాస్ట్ స్టేజ్ లో ఉండగానే ఇప్పుడు నాని నెక్స్ట్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది.

నాని 31వ( Nani31 ) సినిమాను కన్ఫర్మ్ చేస్తూ ఈ రోజు అఫిషియల్ ప్రకటన అయితే వచ్చింది.సినిమాను వివేక్ ఆత్రేయతో( Vivek Athreya ) చేయనున్న విషయం విదితమే.ఇప్పటికే వీరి కాంబోలో అంటే సుందరానికి సినిమా వచ్చింది.
ఈ సినిమా రిజల్ట్ దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా గట్టి హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈ క్రేజీ కాంబోను ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ అందుకున్న డివివి ఎంటర్టైన్మెంట్స్ పై( DVV Entertainments ) నిర్మిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
అంతేకాదు ఈ సినిమా అక్టోబర్ 24న గ్రాండ్ లాంచ్ చేస్తున్నట్టు తెలిపారు.మరి ఈ ఇంట్రెస్టింగ్ కాంబో ఎలా ఉంటుందో చూడాలి.







