శాన్ ఫ్రాన్సిస్కోకు( San Francisco ) చెందిన ఓ గర్భిణి ఎయిర్‌బీఎన్‌బీలో( Airbnb ) తన ఫ్లాట్‌ను అద్దెకిస్తున్నట్లు లిఫ్ట్ చేసింది.అందులో ఒక వ్యక్తి ఇంట్రెస్ట్ చూపగా అతడికి నెల రోజుల పాటు అద్దెకు ఇచ్చింది.
అయితే అద్దెకు తీసుకున్న సదరు అతిథి ఫ్లాట్‌ను ధ్వంసం చేశాడు.ఆ దెబ్బకు సదరు మహిళ నిరాశ్రయురాలైంది.
వేల డాలర్ల అప్పుల్లో మునిగింది.అద్దెకివ్వడం ఒక పీడకల అని ఆమె సోషల్ మీడియాలో తన బాధను వెల్లడించింది.
ఈ సంఘటన ఏప్రిల్ 2023లో జరిగిందని, తనకు 300,000 డాలర్ల అప్పు మిగిలిందని ఆమె చెప్పింది.ఆమె ఒకదానిపై ఒకటి రెండు ఫ్లాట్‌లతో కూడిన రెండు యూనిట్ల భవనాన్ని కలిగి ఉంది.
ఆమె దిగువన నివసిస్తుంది, పైభాగాన్ని అద్దెకు ఇస్తుంది.
![Telugu Airbnb, Airbnbceo, Coach Erika, Damaged, Guest, Damage, Latest, Nri, Preg Telugu Airbnb, Airbnbceo, Coach Erika, Damaged, Guest, Damage, Latest, Nri, Preg](https://telugustop.com/wp-content/uploads/2023/10/Pregnant-Airbnb-Host-Left-Homeless-and-in-Rs-2-Crore-Debt-After-Guest-Damages-Property-detailsa.jpg)
ఆమె తన కథనాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్)లో “కోచ్ ఎరికా”( Coach Erika ) పేరుతో పోస్ట్ చేసింది.దానిని “ఎయిర్‌బీఎన్‌బీ హర్రర్ స్టోరీ” అని పేర్కొంది.ఆమె ఎయిర్‌బీఎన్‌బీ సీఈఓ బ్రియాన్ చెస్కీని( Airbnb CEO Brian Chesky ) ట్యాగ్ చేసి న్యాయం చేయాలని కోరింది.
గెస్ట్ ఎటువంటి హెచ్చరిక లేకుండా ముందుగానే చెక్ ఔట్ చేసారని, పిల్లల తొడుగులు, మానవ వ్యర్థాలతో టాయిలెట్ మూసుకుపోయిందని ఆమె వివరించింది.అతిథి ట్యాంక్ నుంచి గిన్నెకు నీటి ప్రవాహాన్ని నియంత్రించే వాల్వ్‌ను కూడా బ్రేక్ చేశాడట.
దీంతో మరుగుదొడ్డి నుంచి నీరు పొంగి 15 గంటలకు పైగా ఫ్లాట్‌ను ముంచెత్తిందని, తీవ్రమైన ప్రెగ్నెన్సీ వికారంతో నిద్రపోతున్న తనకు ఈ విషయం తెలియలేదని ఆమె వాపోయింది.
![Telugu Airbnb, Airbnbceo, Coach Erika, Damaged, Guest, Damage, Latest, Nri, Preg Telugu Airbnb, Airbnbceo, Coach Erika, Damaged, Guest, Damage, Latest, Nri, Preg](https://telugustop.com/wp-content/uploads/2023/10/Pregnant-Airbnb-Host-Left-Homeless-and-in-Rs-2-Crore-Debt-After-Guest-Damages-Property-detailsd.jpg)
తన భవనంలోని మూడు స్థాయిల్లో నీరు ప్రవహించిందని, మల నీటితో తన ఇంటిలో 50% దెబ్బతిన్నదని ఆమె చెప్పింది.పరిహారం కోసం ఆమె ఎయిర్‌బీఎన్‌బీని సంప్రదించింది, కానీ వారు డబ్బు చెల్లించడానికి నిరాకరించారు.ఎయిర్‌బీఎన్‌బీ “$3M హోస్ట్ డ్యామేజ్ ప్రొటెక్షన్” పాలసీ నుంచి తనకు కొంత ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నానని, అయితే తాను నిరాశ చెందానని ఆమె చెప్పింది.
తాను ఆరు నెలలుగా ఎయిర్‌బీఎన్‌బీ సపోర్ట్‌కు ఇమెయిల్‌లను పంపిస్తున్నానని, అయితే తన ఇంటికి తిరిగి వెళ్లడానికి ఎలాంటి డబ్బు లేదా టైమ్‌లైన్ అందలేదని ఆమె తెలిపారు.తాను ఇప్పటికీ నిరాశ్రయురాలిగా, గర్భవతిగా ఉన్నానని, తన బిడ్డను తాత్కాలిక ప్రదేశానికి తీసుకురావాలని ఆమె చెప్పింది.
తన కథకు ఇంకా హ్యాపీ ఎండింగ్ లేదు అంటూ పోస్ట్ ముగించింది.